మేకప్‌లో ఫౌండేషన్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ముఖం రంధ్రాలను నింపడమే కాకుండా మేకప్ కోసం మృదువైన ఆధారాన్ని కూడా సృష్టిస్తుంది.
ఫౌండేషన్‌ను ఎలా అప్లై చేయాలో చాలా మందికి తెలియదు. ముఖానికి ఫౌండేషన్ అప్లై చేయడానికి కొన్ని టిప్స్ ఫాలో కావాలి.
ముఖానికి మేకప్ వేసుకునే ముందు ఫౌండేషన్ అంటే ప్రైమర్‌ను అప్లై చేయడం ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవాలి. ఇది రంగును సమం చేస్తుంది. ముఖం మృదువుగా కనిపించేలా చేస్తుంది.
చాలా మంది మొదట ఫౌండేషన్‌ను అప్లై చేసి ఆపై కళ్ల కింద, ఇతర చోట్ల కన్సీలర్ని ఉపయోగిస్తారు. ఇలా చేయకూడదు. ముందుగా ఫౌండేషన్ అప్లై చేసి తర్వాత కన్సీలర్ అప్లై చేయాలి. దీంతో ముఖంపై మచ్చలు కనిపించకుండా ఉంటాయి.
కన్సీలర్ని ముఖానికి అప్లై చేసిన తర్వాత కొంత సమయం పాటు అలాగే ఉంచాలి. కన్సీలర్ సెట్ చేయడానికి కొంత సమయం పడుతుంది. దీంతో ఇది ముఖంపై బాగా కలిసిపోతుంది.
ఫౌండేషన్‌ను ఉపయోగించినప్పుడు దవడ, ముక్కుపై దృష్టి పెట్టాలి. కన్సీలర్, ఫౌండేషన్ షీర్ అయ్యే వరకు బాగా బ్లెండ్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.