Love Tips: ప్రస్తుత కాలంలో ప్రేమ అనే పదానికి విలువ లేకుండా పోయింది. దీనికి కారణం ఇప్పుడున్న జనరేషన్ బంధాలకి, బంధుత్వాలకి, ప్రేమలకి అంతగా విలువ ఇవ్వడం లేదు. సోలో లైఫ్ ఏ బెస్ట్ అంటూ ప్రతి ఒక్కరూ ఒంటరి జీవితానికి అలవాటు పడుతున్నారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ.. ప్రేమ విషయానికి వచ్చేసరికి అమ్మాయిలైనా అబ్బాయిలైనా త్వరగా అట్రాక్ట్ అవుతారు. అంతేకాదు అంతే త్వరగా మోసపోతారు.. కొందరిలో సిన్సియారిటీ లవ్ ఉంటుంది.. కానీ వాళ్ళు లైఫ్ ఇవ్వలేరు. కొందరికి లైఫ్ దొరుకుతుంది కానీ వాళ్ళలో ప్రేమ ఉండదు. ఈ రెండిటినీ బ్యాలెన్స్ చేయాలంటే జీవితం సాగిపోదు. అంతేకాదు ఈ సమయంలో ఎన్నో రకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇవన్నీ తట్టుకునే శక్తి ఉంటేనే జీవితం ముందుకు సాగిపోతుంది. ఈ కాలం జనరేషన్‌లో పరిస్థితి అయితే కొందరు మొదట లవ్వుని చాలా ఇంట్రెస్ట్‌గా తీసుకుంటారు. కొంతకాలం తర్వాత విడిపోయినాక మళ్ళీ వాళ్ళకి ఫస్ట్ లవ్ మీద ప్రేమ పుడుతుంది. ఇలాంటి చిన్న చిన్న మాటలకి పడిపోయి మళ్లీ రెండోసారి మోసపోవద్దని నిపుణులు అంటున్నారు.
పెళ్లయినాక నీకేం పని?
- ఎంత లవ్ చేసుకున్నా ఇద్దరు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటేనే దానికి ఒక అర్థం ఉంటుంది. అంతేకానీ లవ్ చేసుకున్నాము.. చేసాను కదా అని అమ్మాయి వేరే అబ్బాయితోపెళ్లి చేసుకున్నా.. అబ్బాయి వేరే అమ్మాయితో పెళ్లి చేసుకున్నాక వారి మధ్య లవ్ ఏముంటుంది.? ఇంకా కొన్ని రోజుల తర్వాత ఏదో ఫస్ట్ లవ్వు అంటూ ప్రేమను వల్కబోస్తూ ఉంటారు. ఇవన్నీ వేస్ట్ మాటలు. అమ్మాయిలైనా అబ్బాయిలైనా పెళ్లి చేసుకున్న వాళ్లకు ప్రేమను పంచితేనే జీవితం సంతోషంగా ఉంటుంది. అంతేకానీ మూడో వ్యక్తి ఇద్దరి జీవితంలో ఎంట్రీ అయితే కచ్చితంగా సమస్యలు వస్తయట.
వెంటబడినా నో అని చెప్పండి..
- కొందరికి నిజమైన ప్రేమ ఉంటుంది. కానీ అలాంటి వాళ్ళని వదులుకోవాలంటే చాలా బాధగా అనిపిస్తుంది. కొన్ని సందర్భాలలో ఈ పరిస్థితి తప్పదు. అయితే పెళ్లి కాకపోతే ఇద్దరికీ మ్యారేజ్ కాకపోతే ఇద్దరు కలిసి జీవించడానికి అవకాశం ఉంటుంది. కానీ అమ్మాయి, అబ్బాయి ఇతరులను పెళ్లి చేసుకుంటే ఆ లవ్‌కి ఆ ప్రేమకు విలువ ఉండదు. అలాంటప్పుడు ఎవరు ఎంత వెంటపడినా దానికి విలువ ఉండదు . అందుకని ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం మానేస్తే ఇద్దరి జీవితాలకు మంచిది.
అన్నిటికీ సర్దుకు పోతేనే జీవితం:
- ఈ కాలంలో అన్నిటికీ సర్దుకుపోతనే జీవితం హ్యాపీగా ముందుకు సాగిపోతుంది. లేదని పంతానికి వెళ్తే ఒంటరిగా మిగలవలసి వస్తుంది.
ఎవరి జీవితంలోనైనా ఇదే జరుగుతుంది. ఎన్ని ఆస్తులున్నా, అందం ఉన్న, ఉద్యోగం ఉన్నా.. ఈ చిన్న జీవితానికి సంతోషకరమైన కుటుంబం అవసరం. ఈ కుటుంబమే లేకపోతే జీవితమే ఉండదు. అంతేగాని టైంపాస్ లెక్కల కోసం మంచి జీవితాన్ని భవిష్యత్త్‌ని పాడు చేసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.