Relationship Tips: ఒకప్పుడు పెళ్లంటే మూడునాళ్ళ ముచ్చకాదు ... నూరేళ్ళ బంధం అనేవారు. కానీ ఇప్పుడు జరిగే చాలా పెళ్లిళ్లు మూడునాళ్ళ ముచ్చగానే మిగిలిపోతున్నాయి. ఈ మధ్య సమాజంలో ఎంతో మంది భార్య భర్తలు చిన్న చిన్న విషయాలకే గొడవలు పడి వారి అందమైన వైవాహిక జీవితాన్ని ముక్కలు చేసుకుంటున్నారు. అయితే ప్రతీసారి బంధం తెగిపోవడానికి భర్త ఒక్కటే కారణం కాదు.. ఒక్కోసారి భార్య చేసే తప్పుడు చర్యలు కూడా బంధాన్ని బలహీనపరుస్తాయి. దీని వల్ల వారి వైవాహిక జీవితం నాశనం అవ్వడమే కాదు భర్త తన భాగస్వామి పట్ల ఆసక్తి కూడా కోల్పోతాడు. ఆ తప్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాము.
ఆర్గుమెంట్
భార్య భర్తల బంధం పరస్పర గౌరవం, ప్రేమ అనే పునాదుల పై ఆధారపడి ఉంటాయి. వారి మధ్య ఇవి గట్టిగా ఉంటేనే ఆ బంధం ఎక్కువ కాలం నిలబడుతుంది. ప్రతీ విషయంలో భర్తతో వాదించడం, పదే పదే అవమానంగా మాట్లాడడం వల్ల కొంత కాలానికి భర్త విసుగుచెందుతాడు. ఇక భార్యతో గొడవెందుకులే అని ఆమెకు దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తాడు. భార్యతో మాట్లాడడానికి, సమయం గడపడానికి అంతగా ఇష్టం చూపించరు. దీంతో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు మొదలవుతాయి.
అర్థం చేసుకోలేకపోవడం
ప్రతీ విషయాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం. ఎప్పుడైతే భార్య తన భర్త మాటలను అర్థం చేసుకోకుండా, వాటిలో వేరే అర్థాలను వెతుక్కుంటూ గొడవ పడడం మొదలు పెడుతుందో.. అప్పటి నుంచి ఇద్దరి మధ్య బేదాభిప్రాయాలు వస్తూనే ఉంటాయి. దీనివల్ల కొంతకాలానికి భర్తకు.. భార్యపై ఏ మాత్రం గౌరవం లేకుండా పోతుంది.
అనుమానం
అనుమానం అనేది పెద్ద జబ్బు. ఒక్కసారి భార్యాభర్తల మధ్య అనుమానం అనే పదం వచ్చిందంటే వారి వైవాహిక జీవితం సంతోషానికి దూరమైనట్టే. ఎప్పుడూ భర్తను అనుమానించడం, ఒంటరిగా వదలకపోవడం వంటివి చేయడం వల్ల భర్తకు భార్య పై విసుగు చెందుతుంది.
గౌరవం లేకపోవడం
నలుగురిలో ఉన్నప్పుడు భర్తకు సరైన గౌరవం ఇవ్వాలి. ఎదుటివారి ముందు అతన్ని తక్కువ చేయడం వల్ల అవమానంగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత వాళ్ళు కూడా మిమల్ని గౌరవించడం మానేస్తారు. పదే పదే స్నేహితుల మధ్య, బంధువుల మధ్య భర్తను అవమానించే అలవాటు మానుకోవడం మంచిది.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.