అధిక కేలరీలు తినడం వల్ల లివర్ ప్రాసెస్ చేయనప్పుడు కొవ్వు పేరుకుపోతుంది. దీనినే ఫ్యాటీ లివర్ అంటారు. ఊబకాయం, మధుమేహం వంటి సమస్యలు ఉన్న వ్యక్తుల్లో ఫ్యాటీ లివర్ అభివృద్ధి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
అయితే ఫ్యాటీ లివర్ సాధారణమైన సమస్యే అయినప్పటికీ.. పట్టించుకోకపోతే చాలా ప్రమాదంగా మారే అవకాశం ఉంది. అయితే కొంతమందిలో ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నా.. దాన్ని గుర్తించలేక నిర్లక్ష్యం చేస్తుంటారు.
శరీరంలో ఫ్యాటీ లివర్ సమస్యను కొన్ని సంకేతాల ద్వారా గుర్తించవచ్చు. ఇలాంటి సంకేతాలు తరచుగా కనిపించడం లివర్ ప్రమాదాన్ని సూచిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము..
కడుపులో నొప్పి
కాలేయంలో అధిక కొవ్వు పేరుకుపోయిన వ్యక్తి .. కడుపులో తరచూ నొప్పిని అనుభవిస్తూ ఉంటాడు. ఈ నొప్పి ఎక్కువగా కుడివైపు కడుపు భాగంలో ఉంటుంది. కొంతమందికి కడుపు వాపుగా కూడా అనిపించవచ్చు. ఇలాంటి సమస్య ఉన్నవారు వెంటనే వైద్యున్ని సంప్రదించండి.
కామెర్లు, కళ్ళు పసుపుగా మారడం
కాలేయంలో కొవ్వు పేరుకుపోయినప్పుడు చర్మం, కళ్ళు పసుపు రంగులో కనిపించడం మొదలవుతుంది. ఇది కామెర్లకు సంకేతంగా చెబుతారు. కాలేయం ఎర్ర రక్తకణాల నుంచి ఉత్పత్తి అయ్యే వ్యర్థ పదార్థం బిలిరుబిన్ను ఫిల్టర్ చేయలేనప్పుడు కామెర్లకు దారితీస్తుంది. కామెర్ల తీవ్రత ఎక్కువైతే లివర్ డ్యామేజ్ జరిగే ప్రమాదం ఉంటుంది.
తీవ్రమైన అలసట, బలహీనత
కాలేయ సమస్యలను సూచించే అత్యంత సాధారణమైన లక్షణాల్లో అలసట ఒకటి. తరచూ నీరసంగా, బలహీనంగా అనిపించడం కాలేయ అధిక కొవ్వు పేరుకుపోవడానికి సంకేతం. శరీరంలో కొవ్వు పెరగడం వల్ల త్వరగా అలసట రావడం, సత్తువ లేకపోవడం జరుగుతుంది.
శరీరం పై దురద
శరీరంలో అధిక కొవ్వు ఉండడం వల్ల చర్మంపై దురద ప్రారంభమవుతుంది. ముఖ్యంగా మొహం పై ఎక్కువగా ఉంటుంది.