Cloves: సుగంధ ద్రవ్యాలలో ఒకటైన లవంగం గురుంచి మనందరికీ తెలిసిందే. దీనిని మసాలా వంటకాల్లో ఎక్కువగా వాడతారు. లవంగం జీర్ణ సమస్యలకు అద్భుతమైన ఔషధం. ఇది జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ముఖ్యంగా అజీర్ణం, ఫ్యాటీ లివర్ సమస్యను, ఆర్థరైటిస్, గుండె జబ్బులు, క్యాన్సర్ లాంటి సమస్యలను నివారిస్తుంది.
Also Read: 5 వ రోజు అట్ల బతుకమ్మ.. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి?
లవంగం ప్రయోజనాలు
లవంగాలు శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీ బాక్టీరియల్, క్రిమినాశక లక్షణాలను కలిగి ఉంటాయి. అందుకే వీటిని చిగుళ్ల , దంత సమస్యలను నివారించేందుకు ఉపయోగిస్తారు. ఆహారంలో లవంగాలను చేర్చుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు.
Also Read: రోజొక్క తీరు.. రేపు ఏడో రోజు వేపకాయల బతుకమ్మ.. నైవేద్యం ఇలా చేయండి