Money saving: నెలంతా కష్ట పడతాం.. కానీ నెలాఖరి వచ్చేసరికి జేబులో మొత్తం ఖాళీ అవుతుంది. కొంత మంది ఎంత సంపాదించినా..ఆ డబ్బును ఆదా చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ఆన్లైన్ లో బట్టలని, నగలని, ఫుడ్ అని రకరకాల షాపింగ్ లతో కార్డు అంతా ఖాళీ అయిపోతుంది. సంపాదిస్తే సరిపోదు.. డబ్బును పొదుపు చేయడం, పొదుపుగా వాడుకోవడం కూడా చాలా ముఖ్యం. అదే అత్యవసర పరిస్థితుల్లో మిమల్ని రక్షిస్తుంది. అంతేకాదు భవిష్యత్తు కోసం ఆర్ధిక భద్రత అనేది చాలా ముఖ్యం. అయితే ప్రతి ఒక్కరు కొన్ని అలవాట్లను పాటించడం ద్వారా డబ్బును చాలా ఈజీగా అదా చేయవచ్చు. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.. Also Read: పవన్ ను ఇబ్బంది పెట్టకండి.. ఫ్యాన్స్ కు 'ఓజీ' మేకర్స్ రిక్వెస్ట్ ఇలా డబ్బును అదా చేయవచ్చు ముందుగా ఆన్‌లైన్ లావాదేవీల యాప్‌లను ఎక్కువగా ఉపయోగిస్తుంటే.. ఆ అలవాటును వెంటనే మానుకోండి. ఈ యాప్‌లను వీలైనంత దూరంగా ఉండడం వల్ల చాలా ఖర్చులు తగ్గుతాయి. వీటిని వాడుతున్నప్పుడు ఎంత ఖర్చు చేస్తున్నాము? ఏంటి? అనేది గ్రహించలేము. ప్రతి నెల బడ్జెట్‌ను ప్లాన్ చేసుకోవాలి. దీని వల్ల దేనికి ఎంత ఖర్చు పెట్టాలి, ఏది అవసరం,ఏది అనవసరం అనేది తెలుస్తుంది. మీ ఆదాయాన్ని పనికిరాని లేదా అనవసరమైన వాటిపై ఖర్చు చేయకుండా ఉండటానికి, ప్రాధాన్యతల ఆధారంగా ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకోండి. మరీ ఎక్కువ ఆదా చేయలేకపోతే నెలకు కనీసం 5000 చొప్పున ఆదా చేసినా.. సంవత్సరానికి చాలా డబ్బు సేవ్ అవుతుంది. డబ్బు ఆదా చేయడానికి ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్ యాప్‌ల వినియోగాన్ని తగ్గించండి. ఇలా చేయడం వల్ల మీరు డబ్బు ఆదా చేయడమే కాకుండా ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని కూడా తింటారు. అలాగే ఆన్‌లైన్‌లో రేషన్, రోజువారీ నిత్యావసరాలను ఆర్డర్ చేయడం ఆపండి. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసినప్పుడు.. ఆటోమెటిక్ గా అవసరమైన దానికంటే ఎక్కువ వస్తువులను ఆర్డర్ చేసే అవకాశముం ఉంటుంది. చాలా మంది తమకు అవసరం లేని సమయంలో కూడా ఆన్‌లైన్‌లో దుస్తులను కొనుగోలు చేస్తారు. ఇలా కాకుండా అవసరమైనప్పుడు మాత్రమే షాపింగ్ చేయడం ద్వారా డబ్బులు ఆదా చేయవచ్చు. Also Read: యూట్యూబ్ ను షేక్ చేసిన ఏకైక ఇండియన్ సాంగ్..'కుర్చీ మడతపెట్టి' నయా రికార్డ్ గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. Also Read: డెడ్ బాడీ పార్శిల్ కేసులో బిగ్ ట్విస్ట్.. శవం దొరకలేదని అమాయకుణ్ని హతమార్చారు?