ఎడమచేతి వాటం ఉన్న వ్యక్తులలో నిరాశ, ఆందోళన వంటి మానసిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు గమనించారు. ఎడమచేతి వాటం అనేది జన్యుపరమైన కారణాల వల్ల తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమిస్తుంది. కొన్ని సందర్భాల్లో సామాజిక పరిస్థితుల వల్ల కూడా ఇది అభివృద్ధి చెందుతుంది.
కుడిచేతి వ్యక్తులతో పోల్చితే ఎడమచేతి వాటం ఉన్నవారిలో మూడ్ స్వింగ్స్, ఆందోళన, భయము, చిరాకు, విశ్రాంతి లేకపోవడం, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ వంటివి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. కానీ దీనికి సరైన కారణమేంటి అనే దానిపై స్పష్టత లేదు. జన్యుపరమైన సమస్యలు, మెదడు కనెక్టివిటీ, పర్యావరణ పరిస్థితులు లాంటి అనేక అంశాలు దీని కారణం కావచ్చని నిపుణులు భావిస్తున్నారు.