కార్తీక పౌర్ణమి రోజున లక్ష్మీ దేవిని పూజించడం, గంగాస్నానం చేయడంతో పాటు కొన్ని ప్రత్యేక వస్తువులను దానం చేయాలి. ఇలా చేయడం వల్ల సంపదలు కలుగుతాయని చెబుతున్నారు.
శీతాకాలం వచ్చేసింది. పేదలకు దుప్పట్లు దానం చేయడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. కార్తీకపౌర్ణమి రోజు ఇచ్చే దానం అంతులేని ప్రయోజనాలను ఇస్తుంది.
కార్తీక పౌర్ణమి రోజు జున్ను, పాలు, పెరుగు, నెయ్యి, పంచదార, అన్నం దానం చేయండి. నెయ్యి దానం చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది. అలాగే శుక్రుడి శుభ ప్రభావం వల్ల మనిషికి సంపద పెరుగుతుంది.
భర్త దీర్ఘాయువు, పిల్లల పురోగతి కోసం కార్తీకపౌర్ణమి రోజు మహిళలకు పచ్చని గాజులు, చీర, బిందెలు మొదలైనవి దానం చేస్తే చాలా మంచిది.
కార్తీకపౌర్ణమి రోజు పండ్లను దానం చేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అంతేకాకుండా దేవతల అనుగ్రహం మీకు లభిస్తుంది.
శాస్త్రాల ప్రకారం కార్తీకపౌర్ణమి రోజు అన్నదానం చేయడం గొప్ప దానంగా పరిగణించబడుతుంది. ఈ పవిత్రమైన రోజున అన్నదానం చేయడం వల్ల ఒక వ్యక్తి ఇంట్లో ఎప్పుడూ ఆహారానికి లోటు ఉండదు. అలాగే బెల్లం కూడా దానం చేయవచ్చు.