/rtv/media/media_files/2025/10/08/karwa-chauth-2025-10-08-11-38-22.jpg)
Karwa Chauth
Karwa Chauth: కర్వా చౌత్ అనేది వివాహిత మహిళలు జరుపుకునే అత్యంత ప్రాముఖ్యమైన పండగ. భర్త ఆరోగ్యం, దీర్ఘాయుష్షు, శ్రేయస్సు కోరుకుంటూ భార్యలు కర్వా చౌత్ నాడు ఎంతో భక్తి శ్రద్దాలతో ఉపవాస దీక్ష చేస్తారు. సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు నిర్జల ఉపవాసం ఉంటారు. నిర్జల అంటే కనీసం నీరు కూడా తాగకుండా అని అర్థం.
అయితే ఈ కర్వా చౌత్ ఉపవాసంలో సర్గీ ప్లేట్ అనేది చాలా ముఖ్యమైనది. ఉపవాసం ప్రారంభించడానికి ముందు.. అంటే సూర్యోదయం కంటే ముందే అత్తగారు కోడలికి ఇచ్చే ప్రత్యేక ఆహారాన్ని సర్గీ అంటారు. ఇందులో స్వీట్లు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ వంటివి ఉంటాయి. ఇది ఉపవాస సమయంలో శరీరంలో శక్తిని కాపాడుకోవడానికి మాత్రమే కాకుండా ఉపవాసం ఉన్న స్త్రీకి దాహం వేయకుండా నిరోధిస్తాయి. కావున సర్గీ ప్లేట్ ఎంచుకోవడం చాలా ముఖ్యమైనది. సర్గీ ప్లేట్ లో చేర్చాల్సిన ఐదు ముఖ్యమైన పదార్థాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..
సర్గీ ప్లేట్
సీట్లు
సర్గి ప్లేట్‌లో స్వీట్లు తప్పనుసరిగా ఉండాలి. లడ్డు, హల్వా, బర్ఫీ, మాత్రి లేదా ఫెని వంటి స్వీట్లను చేర్చుకోవచ్చు. వీటిని తినడం వల్ల ఉపవాసానికి శక్తి, బలం లభిస్తుంది.
ఎండిన పండ్లు
బాదం, జీడిపప్పు, పిస్తా, ఎండుద్రాక్ష వంటి ఎండిన పండ్లను కూడా సర్గి ప్లేట్‌లో చేర్చుకోవడం మంచి ఎంపిక. ఇవి శరీరానికి పోషకాలను అందించడంతో పాటు శక్తిని నిర్వహించడానికి సహాయపడతాయి.
పరాఠా
పంజాబీలు ఎల్లప్పుడూ తమ సర్గిలో గోధుమ పిండి పూరీలు లేదా పరాఠాలు చేర్చుకుంటారు. రోజంతా ఆకలిని అరికట్టడానికి వీటిని నెయ్యితో తయారు చేస్తారు.
కూరగాయలు
బంగాళాదుంప కర్రీ లేదా మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీనీ మీ సర్గీ ప్లేట్ లో చేర్చండి. ఇవి సులభంగా జీర్ణం అవుతాయి.
పండ్లు
సర్గీ ప్లేట్‌లో ఆపిల్, అరటిపండు, దానిమ్మ లేదా కాలానుగుణ పండ్ల వంటి తాజా పండ్లను జోడించడం వల్ల శరీరానికి హైడ్రేషన్, వివిధ విటమిన్లు లభిస్తాయి.
పాలఉత్పత్తులు
పెరుగు, లస్సీ లేదా రబ్రీ కూడా మీ సర్గీ ప్లేట్ లో ఉండేలా చూసుకోవాలి. ఇవి కడుపును చల్లబరుస్తాయి. అలాగే మెరుగైన జీర్ణక్రియను సహాయపడతాయి.
నీరులేదాజ్యూస్
కొబ్బరి నీళ్లు, మజ్జిగ లేదా తాజా రసం సర్గీ ప్లేట్ లో చేర్చడం ద్వారా శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడతాయి.
సాయంత్రం జల్లెడలో చంద్రుడిని చూసిన తర్వాత భర్త మొహం చూసి భర్త చేతుల మీదుగా ఉపవాస దీక్షను విరమిస్తారు. తెలుగు ప్రాంతాల్లో దీనిని అట్ల తదియతో పోలుస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం.. కర్వా చౌత్ కార్తీక మాసంలో కృష్ణ పక్ష చతుర్థి రోజున వస్తుంది. అంటే అక్టోబర్ లేదా నవంబర్ లో ఇది వస్తుంది.