కార్తీక మాసంలో మాంసం తినడం నిజంగా ప్రమాదకరమా? అసలు నిజమేంటి? కార్తీక మాసం అంటే హిందువుల కోసం చాలా పవిత్రమైన నెల. ఈ నెలలో చాలామంది మాంసం తినడం మంచికాదని భావిస్తారు. అయితే ఈ టైంలో మాంసం తినకూడదనే నమ్మకానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారం లేదని. అది కేవలం ఒక సంప్రదాయం మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు. By Archana 17 Nov 2024 in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update Karthika Masam non veg షేర్ చేయండి Karthika Masam: కార్తీక మాసం హిందువులకు చాలా పవిత్రమైన నెల. ఈ నెలలో మహిళలు, పెళ్లి కానీ అమ్మాయిలు, ఇతరులు పరమ శివుడిని ఎంతో భక్తి శ్రద్దలతో పూజిస్తారు. నెల రోజుల పాటు ఉదయం, సాయంత్రం దీపారాధనలు చేస్తారు. అయితే కార్తీక మాసంలో చాలామంది మాంసం తినడం మానేస్తారు. ఎందుకంటే ఈ మాసంలో మాంసం తినడం పాపమని లేదా శరీరానికి హానికరమని భావిస్తారు. అయితే దీనికి శాస్త్రీయంగా ఎటువంటి ఆధారాలు లేవు. అసలు ఈ అపోహ వెనుక ఉన్న నిజాలు, కారణాలు ఏంటి..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. ఎందుకు మాంసం తినకూడదని అంటారు? కార్తీక మాసం సరిగ్గా శీతాకాలం మొదలయ్యే సమయంలో వస్తుంది. అయితే పూర్వంలో శీతాకాలం వచ్చేటప్పటికీ చెరువులు, నదుల్లో నీరు మురికగా ఉండేదట. అందువల్ల చేపలు, ఇతర జలచరాలు కలుషితమై ఆరోగ్యానికి హాని కలిగించే అవకాశం ఉంది. అందుకే ఆ సమయంలో మాంసం తినకూడదని సూచించేవారట. అలాగే ఈ నెలలో దేవుడిని ప్రార్థించడంలో ఎక్కువ సమయం కేటాయించాలి అని భావించేవారు. అందుకే హింసాచారాలకు దూరంగా ఉండాలని చెప్పేవారు. Also Read: మిస్ యూనివర్స్ 2024.. 21ఏళ్ల భామకు విశ్వసుందరి కీరిటం! కార్తీక మాసంలో నాన్ వెజ్ తినకూడదు అనడానికి మరో కారణం కూడా చెబుతారు. ఈ మాసం గొర్రెలు, మేకలకు సంతానోత్పత్తి కాలం.. అందుకే వాటి హింసించరు. తద్వారా మందలు మరింత పెరుగుతాయని ఆశిస్తారు. తినాలా..? వద్దా..? నిజానికి మాంసాహారం ఆరోగ్యానికి ఎటువంటి హానీ చేయదు. దీనిలోని ప్రోటీన్లు, విటమిన్లు శరీరానికి బలాన్నిస్తాయి. కార్తీక మాసంలో నాన్ వెజ్ తింటే మంచిది కాదు అనే అభిప్రాయం పూర్తిగా తప్పు. కార్తీక మాసంలో మాంసం తినకూడదనే నమ్మకానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారం లేదు. అది ఒక సంప్రదాయం మాత్రమే. ఈ సంప్రదాయం ప్రతి ఒక్కరి వ్యక్తిగత నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. కాకపోతే వింటర్ లో రోగాల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కావున తినే ఆహారం శుభ్రంగా, బాగా ఉడకబెట్టినదై, శరీరానికి ఎటువంటి హాని చేయపోతే చాలు. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. Also Read: అవినాష్ కి షాకిచ్చిన నబీల్..నో ఎలిమినేషన్ ట్విస్ట్..! మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి