Milk: ఇది ఒక్క చుక్క వేస్తే చాలు పాలల్లో కల్తీ తెలిసిపోతుంది

పాలు చిక్కగా ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి బోరిక్ యాసిడ్, క్లోరిన్, అమ్మోనియా సల్ఫేట్ వంటి కెమికల్స్‌ కలుపుతున్నారు. పీహెచ్ స్ట్రిప్‌తో పాలకల్తీని కనిపెట్టవచ్చు. స్ట్రిప్‌పై చుక్క పాలను వేసి స్వచ్ఛమైన పాలని గుర్తించవచ్చు.

New Update

Milk: ఇటీవల కల్తీపాలు చాలాచోట్ల కలకలం రేపుతున్నాయి. లాభాల కోసం చాలామంది పాలను కల్తీ చేసి కటకటాల పాలవుతున్నారు. పోషకాహారం అందించే పాలలో కొందరు నీరు కలిపితే... మరి కొందరు రసాయనాలు కలిపి కల్తీ చేస్తున్నారు. కృత్రిమ పాల తయారీకి మరికొందరు నీళ్లు, రంగులు, చౌక నూనెలు, క్షార ద్రావణాలు, యూరియా, డిటర్జెంట్లు వాడుతున్నారు.

పాల కల్తీని కనిపెట్టవచ్చు:

పాల కల్తీ నేరమే కాదు.. ప్రజారోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తోంది. సరైన పోషకాలు అందకపోతే పిల్లల ఎదుగుదల, మానస వికాసం జరగదు. ఈ విషయం తెలిసి కూడా చాలామంది లాభాల కోసం పాలను కల్తీ చేస్తున్నారు. పాలు చిక్కగా ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి కొందరు వ్యాపారులు బోరిక్ యాసిడ్, క్లోరిన్, అమ్మోనియా సల్ఫేట్ వంటి కెమికల్స్‌ కలుపుతున్నారు. మార్కెట్లో దొరికే పీహెచ్ స్ట్రిప్‌తో పాల కల్తీని కనిపెట్టవచ్చు. స్ట్రిప్‌పై చుక్క పాలను వేయండి. పీహెచ్ రేషియో 6.4-6.6 మధ్యలో ఉంటే స్వచ్ఛమైన పాలని గుర్తించాలి. అంతకన్నా తక్కువ ఉంటే పాలు కల్తీ అయినట్టు భావించాలి.

ఇది కూడా చదవండి: గడ్డం ఉన్న అబ్బాయిలు వద్దంటూ అమ్మాయిల ఆందోళన

Advertisment
Advertisment
తాజా కథనాలు