HMPV వైరస్ తో కిడ్నీకి ప్రమాదమా ? నిపుణులు ఏం చెబుతున్నారు?

HMPV వైరస్ మూత్రపిండాలపై కూడా ప్రభావం చూపుతుందని పలు నివేదికలు చెబుతున్నాయి.HMPV వైరస్ తో ఆస్పత్రిలో చేరిన పిల్లల పై జరిపిన ఒక అధ్యయనంలో HMPV సంక్రమణ తీవ్రమైన మూత్రపిండ సమస్యలతో సంబంధం కలిగి ఉంటుందని కనుగొన్నారు.

author-image
By Archana
New Update
HMPV virus

HMPV virus Photograph: (HMPV virus )

HMPV వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. చైనా నుంచి వచ్చిన ఈ వైరస్ ఇటీవలే భారత్‌ లో కూడా ప్రవేశించింది. దీంతో ప్రజలు తీవ్ర భయందోళనలకు గురవుతున్నారు.   అయితే ఈ వైరస్ గురించి భయపడాల్సిన అవసరం లేదని ఐసీఎంఆర్, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేశాయి. జ్వరం అలసట, దగ్గు, రద్దీ మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఈ వైరస్ సాధారణ లక్షణాలు. అయితే HMPV వైరస్ మూత్రపిండాలపై కూడా  ప్రభావం చూపుతుందని పలు  నివేదికలు చెబుతున్నాయి. దీనిపై నిపుణులు ఏం అంటున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..  

HMPV  కిడ్నీలకు ప్రమాదాన్ని కలిగిస్తుందా?

HMPV ప్రధానంగా  శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేసినప్పటికీ .. ఇది ఇతర అవయవాలను కూడా ప్రభావితం చేస్తుందని నివేదికలు చెబుతున్నాయి.ఇటీవలే HMPV, కిడ్నీ ఆరోగ్యానికి సంబంధించి నిర్వహించిన ఓ అధ్యయనంలో షాకింగ్ నిజాలు వెల్లడయ్యాయి.  HMPV వైరస్ తో ఆస్పత్రిలో చేరిన పిల్లల పై జరిపిన ఒక అధ్యయనంలో HMPV సంక్రమణ తీవ్రమైన మూత్రపిండ సమస్యలతో  సంబంధం కలిగి ఉంటుందని కనుగొన్నారు. వయసుతో పాటు ఈ ప్రమాదం పెరుగుతుందని  అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే దీనికి సంబంధించి మరింత పరిశోధన చేయాల్సిన అవసరం ఉందని నిపుణుల అభిప్రాయం.  

HMPV నిర్ధారణ ఎలా?


కొన్ని పరీక్షలతో ఈ వైరస్‌ని గుర్తించవచ్చు.

రాపిడ్ యాంటిజెన్ టెస్ట్- ఈ పరీక్ష శీఘ్ర ఫలితాలను పొందడానికి అనుకూలంగా ఉంటుంది. కానీ ఇవి PCR పరీక్షల కంటే తక్కువ సున్నితత్వం కలిగి ఉంటాయి.

బ్రోంకోస్కోపీ- ఈ పరీక్ష ఊపిరితిత్తుల శ్వాసనాళాల్లో మార్పులను చూడడానికి చేయబడుతుంది.

HMPV PCR పరీక్ష - ఇది వైరస్‌ను గుర్తించగల పరమాణు పరీక్ష.  HMPVని గుర్తించడానికి ఉత్తమంగా పరిగణించబడుతుంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు