/rtv/media/media_files/2025/12/01/healthy-breakfast-2025-12-01-10-15-04.jpg)
Healthy Breakfast
Healthy Breakfast: స్ప్రౌట్స్(Sprouts), మొలకెత్తిన గింజలను పెసలు, కందులు, శెనగలు, ధాన్యాలు వంటి గింజలను నానబెట్టి మొలకలు వచ్చినప్పుడు వాటిని స్ప్రౌట్స్‌గా తింటారు. ఇవి ప్రోటీన్, కేల్షియం, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, ఎంజైములు వంటి ఎన్నో పోషకాలు కలిగి ఉండటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచివి.
తక్కువ కేలరీలతో ఎక్కువ పోషకం
100 గ్రాముల మొలకల్లో సుమారు 100-110 కేలరీలే ఉంటాయి. కానీ వాటిలో శరీరానికి అవసరమైన మంచి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇవి చాలా ఉపయోగకరమైన ఆహారం.
ఫైబర్ ఎక్కువగా ఉంటుంది
ఒక సారి తీసుకునే స్ప్రౌట్స్‌లో దాదాపు 7.5 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, ఎక్కువసేపు ఆకలిగా రాకుండా చూసుకుంటుంది. ఒబేసిటీ ఉన్నవారికి, షుగర్ ఉన్నవారికి ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహారం మంచిది. మలబద్ధకం సమస్య ఉన్నవారికి ఇవి ఎంతో ఉపశమనం ఇస్తాయి.
ప్రోటీన్ సమృద్ధిగా
ప్రోటీన్ శరీర నిర్మాణానికి ఎంతో అవసరం. స్ప్రౌట్స్ తక్కువ ఖర్చుతో మంచి ప్రోటీన్ అందించే ఆహారం. ఒక కప్పు మొలకల్లో దాదాపు 14 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ప్రోటీన్ ఎక్కువ ఉండటం వల్ల కొవ్వు తగ్గడంలో కూడా సహాయపడుతుంది.
కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయం
మొలకల్లో కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది. అలాగే ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దాంతో గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
డిటాక్స్ చేయడంలో సహాయం
స్ప్రౌట్స్‌లో ఉండే క్లోరోఫిల్, ఎంజైములు శరీరంలోని విషపదార్థాలను తగ్గించడంలో సహాయపడుతాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. జీర్ణక్రియను సులభం చేస్తాయి.
కళ్లకు మంచివి
స్ప్రౌట్స్‌లో విటమిన్ A మంచి మొత్తంలో ఉంటుంది. ఇది చూపును మెరుగుపరుస్తుంది. అలాగే మొలకల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు కళ్లను రక్షిస్తాయి. నైట్ బ్లైండ్‌నెస్, కంటిచెమ్మ వంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
జుట్టు పెరుగుదల
స్ప్రౌట్స్‌లో విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి తలచర్మంలో రక్తప్రసరణ మెరుగుపరచి జుట్టు పెరగడంలో సహాయం చేస్తాయి. జుట్టు రాలడం తగ్గిస్తుంది, చుండ్రు తగ్గిస్తుంది, ముందుగానే తెల్లబడే సమస్యను కూడా తగ్గించగలవు.
చర్మం మెరుగుపడేందుకు సహాయ
మొలకల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని లోపల నుంచి శుభ్రం చేస్తాయి. వయస్సు పెరిగే కొద్దీ వచ్చే ముడతలు, మచ్చలు, చర్మం వాడిపోవడం వంటి సమస్యలను తగ్గించడంలో ఇవి సహాయపడతాయి.
అదనపు లాభాలు
- సులభంగా జీర్ణమవుతాయి
- విటమిన్లు, ఖనిజాలు పెరుగుతాయి
- విటమిన్ A రెట్టింపు అవుతుంది
- విటమిన్ B ఎక్కువగా పెరుగుతుంది
- విటమిన్ C స్థాయులు పెరుగుతాయి
- పోషకాలు శరీరానికి సులభంగా అందుతాయి
- వండే సమయం తగ్గుతుంది
సాధారణంగా ఉపయోగించే స్ప్రౌట్స్
పెసర మొలకలు
పెసర మొలకల్లో విటమిన్ A, C, E, K, ప్రోటీన్, పోటాషియం, ఫోలేట్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యం, షుగర్, క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతాయి.
ముల్లంగి మొలకలు
విటమిన్లు A, B, C, E, K మరియు అమినో యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. బరువు తగ్గడంలో, చర్మ ఆరోగ్యంలో మరియు క్యాన్సర్‌కు కారణమయ్యే పదార్థాలను తగ్గించడంలో ఇవి ఉపయోగపడతాయి.
సన్‌ఫ్లవర్ మొలకలు
విటమిన్లు D, E, కేల్షియం, ఇనుము, ఫాస్ఫరస్ వంటి పోషకాలు కలిగి ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యం, బరువు నియంత్రణ, వృద్ధాప్యాన్ని తగ్గించడంలో సహాయం చేస్తాయి.
స్ప్రౌట్స్ తినడంలో ప్రమాదాలు
స్ప్రౌట్స్ తడి, వేడి వాతావరణంలో పెరుగుతాయి కాబట్టి వాటిలో బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా E.coli, సాల్మోనిల్లా వంటి ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. పూర్తిగా పచ్చిగా తినడం కొంత ప్రమాదకరం.
స్ప్రౌట్స్‌ను ఎలా సురక్షితంగా తినాలి?
బాగా ఉడికించి లేదా ఆవిరి వేయించి తినడం మంచిది. పచ్చిగా తినడం కన్నా పొయ్యి మీద వేడి చేసి తింటే ఇన్ఫెక్షన్ల ప్రమాదం తగ్గుతుంది.
మొలకలు తయారు చేసే సరైన విధానం
1. గింజలను శుభ్రంగా కడిగి ఎక్కువ నీటిలో నానబెట్టాలి
2. తేలియాడే చెడు గింజలు తీసేయాలి
3. పాత్రను సన్నని బట్టతో కప్పాలి
4. 3–12 గంటలు నానబెట్టాలి
5. నీరు వంపేసి రోజుకు రెండు సార్లు కడిగి 4–5 రోజుల్లో మంచి మొలకలు వస్తాయి.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
Follow Us