మనిషి ఆరోగ్యంగా ఉండటంలో సహాయపడే ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు ఒకటి. శరీరంలోని వ్యర్థాలను తొలగించి, రక్తాన్ని శుద్ధి చేయడంలో ఇవి కీలకపాత్ర పోషిస్తాయి. అయితే జీవనశైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు కడ్నీ సమస్యలకు దారితీస్తున్నాయి.
ఇలా అనిపిస్తే అలర్ట్..
ఉదయం లేవగానే అలసట, శారీరక బలహీతన తరచుగా వేధిస్తుంటే.. కిడ్నీల్లో ఏదో సమస్య ఉన్నట్టే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. యూరిన్ తరచూ రంగు మారడం, ఉదయంపూట మూత్ర విసర్జన చేసేసమయంలో నురుగు ఎక్కువగా రావడం, కడుపులో ఉబ్బరం, విపరీతమైన దాహం, స్కిన్ అలెర్జీలు లాంటి లక్షణాలు కనిపిస్తే మీ కిడ్నీలు ప్రమాదంలో ఉన్నట్లు అనుమానించాలి.