గిగారు పండు..! ఈ పండు గురుంచి చాలా తక్కువ మందికి తెలుసు. దాదాపు ఈ పేరుకూడా ఎవరు విని ఉండరు. కానీ, ఈ పండు గురుంచి తెలిస్తే షాక్ అవుతారు. యాపిల్ జాతికి చెందిన ఈ పండు ఎత్తైన హిమాలయ ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇందులో ఎన్నో రకాల పోషకాలు, ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి.
ఆ వ్యాధులన్నీ పరార్..
గిగారు పండులోని కార్డియోటోనిక్ లక్షణాల వల్ల గుండె సమస్యలు, అధిక రక్తపోటు, అధిక బీపీలను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. అంతేకాకుండా ప్రజలు ఈ చెట్టు కొమ్మను టూత్‌పిక్‌గా కూడా ఉపయోగిస్తారు.