Health: షాకింగ్ ఘటన.. జిమ్ చేస్తుంటే కంటి చూపు పోయింది.. అసలేమైందో తెలుసా?

ప్రతీ రోజూ జిమ్ చేయడం ద్వారా ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంటారని అందరూ అనుకుంటారు. కానీ, జిమ్ చేయడం వల్ల కంటి చూపు కోల్పోయారని మీరు ఎప్పుడైనా విన్నారా?  జిమ్ చేస్తే కంటి చూపు కోల్పోవడం ఏంటి?

New Update
Gym

Gym

Health: ప్రతీ రోజూ జిమ్ చేయడం ద్వారా ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంటారని అందరూ అనుకుంటారు. కానీ, జిమ్ చేయడం వల్ల కంటి చూపు కోల్పోయారని మీరు ఎప్పుడైనా విన్నారా?  జిమ్ చేస్తే కంటి చూపు కోల్పోవడం ఏంటి? అని ఆలోచిస్తున్నారా? అవునండీ బాబు.. ఇటీవలే 27 ఏళ్ళ కుర్రాడు జిమ్ చేస్తూ కంటి  చూపు కోల్పోయాడు. ఈ విషయాన్ని ప్రముఖ డాక్టర్ తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు. నిన్న, మొన్నటి వరకు జిమ్ లో గుండెపోటుతో మరణించడం చూశాం.. ఇప్పుడు కంటి చూపు కోల్పోవడం కలకలం రేపుతోంది. అసలు ఇలా జరగడానికి  కారణమేంటి?  డాక్టర్ చెప్పిన సలహాలేంటి అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.. 

జిమ్ చేస్తూ కంటి చూపు 

సాధారణంగా జిమ్ చేయడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ, కొన్ని సార్లు జిమ్ లో మనం తెలిసి, తెలియక చేసే పొరపాట్లు ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. అయితే ఇటీవలే 27 ఏళ్ళ కుర్రాడికి జిమ్ లో ఎదురైన సంఘటన అందరినీ   దిగ్బ్రాంతికి  గురిచేసింది. 

డెడ్ లిఫ్టింగ్ వ్యాయామం చేస్తుండగా ఆకస్మాత్తుగా అతడు ఒక కంటి చూపును కోల్పోయాడు. ఈ   సంఘటన గురించి డాక్టర్ ఆశీష్ మార్క్ మాట్లాడుతూ.. బాధిత యువకుడు డెడ్ లిఫ్టింగ్ చేస్తుండగా.. అది చాలా బరువుగా ఉండడంతో ఊపిరి బిగబట్టి శక్తినంతా ఉపయోగించి లిఫ్టింగ్స్ చేశాడు. ఆ తర్వాత కొన్ని క్షణాలకే అతడు కంటి చూపును కోల్పోయాడు. దీంతో వెంటనే డాక్టర్ ను సంప్రదించి టెస్ట్ చేశయించుకోగా.. అతనికి వల్సాల్వా రెటినోపతి అనే అరుదైన వ్యాధి ఉందని వైద్యులు గుర్తించారు. 

తీవ్ర ఒత్తిడి

ఈ వ్యాధి ఉన్నవారు తీవ్ర ఒత్తిడికి గురైనప్పుడు రెటీనాలోని చిన్న రక్థకణాలు చిట్లిపోతాయి.  ఫలితంగా దృష్టి కోల్పోవడం, కంటి సమస్యలు తలెత్తడం జరుగుతుంది. ఇప్పుడు బాధిత వ్యక్తి విషయంలో కూడా ఇదే జరిగింది. డెడ్ లిఫ్టింగ్ చేస్తున్న సమయంలో అతడు ఊపిరి బిగబట్టి తీవ్ర ఒత్తిడికి గురికావడంతో కంటి చూపు కోల్పోయాడు. 

వల్సాల్వా  రెటినోపతీ అంటే ఏంటి?

వల్సాల్వా రెటినోపతీ అనేది కంటికి సంబంధించిన సమస్య. దీనిని రెటినోపతీ అని కూడా అంటారు. కంటి వెనుక భాగంలో రెటీనా అనే పొర దెబ్బతినడం వల్ల ఈ సమస్య వస్తుంది. వల్సాల్వా  రెటినోపతీ కండీషన్  ఉన్నవారు  నోరు, ముక్కు మూసుకుని గట్టిగా  ఊపిరి బిగబట్టడానికి  ప్రయత్నించినప్పుడు  ఛాతీ, తల, కంటిలోని రక్తనాళాలలో ఒత్తిడి ఒక్కసారిగా  పెరుగుతుంది. ఈ అధిక ఒత్తిడి కారణంగా, రెటీనాలోని చిన్న రక్తనాళాలు పగిలిపోయి, రక్తస్రావం జరుగుతుంది. దీనివల్ల కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. 

Also Read: Prabhas Spirit: “స్పిరిట్”లో కొరియన్ యాక్షన్ స్టార్ 'మా డాంగ్-సియోక్'..? అప్‌డేట్ వచ్చేసింది.

Advertisment
తాజా కథనాలు