Diabetes: భారతదేశంలో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య గమనీయంగా పెరుగుతోంది. జీవన శైలి విధానాలు, ఆహారపు అలవాట్లు దీనికి ప్రధాన కారణాలుగా ఉంటున్నాయి. ఈ వ్యాధికి చికిత్స లేదు, ఆరోగ్యకరమైన జీవనశైలి ద్వారా మాత్రమే దీనిని నియంత్రించవచ్చు. డయాబెటిక్ రోగులు ఎలాంటి ఆహరం తీసుకుంటే ఉపయోగకరంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
Also Read: పులులు ఎక్కువగా కనిపించే నేషనల్ పార్క్‌లు ఇవే
డయాబెటిక్ డైట్
- చాలా మంది మధుమేహ రోగులు ఏ పండు తినాలో, ఏది తినకూడదు అనే అయోమయంలో ఉంటారు. పచ్చి అరటిపండు, లిచి, దానిమ్మ, అవకాడో, జామపండ్లను తీసుకోవడం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ఆపిల్, నారింజ, దానిమ్మ, బొప్పాయి మరియు పుచ్చకాయలను తినడం ద్వారా శరీరానికి ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. ఫైబర్ రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రించడంలో తోడ్పడుతుంది.
- పండిన అరటిపండు, ద్రాక్ష వంటి వాటిని తినడం మానుకోవాలి. వీటిలో కేలరీ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది చక్కర స్థాయిలను పెంచుతుంది.
- వేయించిన ఆహారాలు, జంక్ ఫుడ్ వంటి వాటికి దూరంగా ఉండాలి. వీటిలో సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు ఈ కొవ్వులు గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతాయి.
- చక్కర కలిపిన జ్యూస్ లను తీసుకోవడం మానుకోవాలి. మధుమేహ రోగులు ఎల్లప్పుడూ జ్యూస్ ప్లైన్ గా తీసుకోవడం మంచిది. ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం మధుమేహ రోగికి హానికరం.
- ధూమపానం, మద్యపానానికి కూడా దూరంగా ఉండాలి. నానబెట్టిన బాదంపప్పు లేదా వాల్ నట్స్ తినకూడదని గుర్తించుకోండి.
- రోజూ తీసుకునే కార్బోహైడ్రేట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కార్బోహైడ్రేట్ల డైట్ లో రాగి, బాజ్రా వంటి మిల్లెట్లను ఎంచుకోవచ్చు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
Also Read: ఇది నానబెట్టి తింటే మలబద్ధకం మాయమవ్వాల్సిందే