చాలా మంది నిత్యం జంక్ ఫుడ్ తింటుంటారు. కొందరు ఎక్కువగా బయట తింటున్నారు.పోషకాహారం కంటే ఎక్కువ జంక్ ఫుడ్ తీసుకుంటున్నారు. తరచూ బయటి ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలతో పాటు బరువు పెరుగుతుంది. ఈ చిట్కాలు పాటిస్తే జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండవచ్చు.
ఎప్పుడు పడితే అప్పుడు తినడం ఆపాలి. రాత్రిపూట ఆలస్యంగా తింటే భోజన సమయాన్ని మార్చండి. రాత్రిపూట ఆలస్యంగా తినడం, తిన్న వెంటనే నిద్రపోవడం జీవక్రియలో మార్పును కలిగిస్తుంది. కాబట్టి రాత్రి 8 గంటల తర్వాత తినడం మానేయండి. బాగా ఆకలిగా ఉంటే స్నాక్స్ తినండి.
భోజనం, స్నాక్స్ వారానికి ముందుగానే ప్లాన్ చేసుకోండి. ఏమి తినాలో ముందుగానే తెలుసుకుంటారు. ముందే ప్రణాళిక వేసుకుంటారు కాబట్టి జంక్ ఫుడ్‌ను నిలుపుదల చేయొచ్చు. కేలరీలను కూడా బర్న్ చేయొచ్చని నిపుణులు అంటున్నారు.
ఏదైనా చేయాలంటే స్థిరత్వం, కృషి అవసరం. జంక్ ఫుడ్‌ను వెంటనే ఆపివేయడానికి బదులుగా మెల్లమెల్లగా తగ్గించండి. ఏదో ఒక రోజు మాత్రమే జంక్‌ఫుడ్ తీసుకోవాలి. చక్కటి షెడ్యూల్ రూపొందించుకోండి.
తరచుగా దాహాన్ని ఆకలిగా భావిస్తాం. కాబట్టి మీరు జంక్ ఫుడ్ తినాలనుకున్నప్పుడు, ఒక గ్లాసు నీరు తాగాలి. 20 నిమిషాలు వేచి ఉండండి.
దాదాపు 80శాతం ఫాస్ట్ ఫుడ్ నమూనాలు రసాయనాలను కలిగి ఉంటాయి. వాస్తవానికి ప్లాస్టిక్‌ను మృదువుగా, సరళంగా చేయడానికి ఉపయోగించే రసాయనాలను జంక్‌ఫుడ్ తయారీలో వాడుతారు. జంక్ ఫుడ్ ఎక్కువగా తినే వ్యక్తుల మూత్రంలో థాలెట్స్ కనిపిస్తాయి.