National Daughters Day : నేడు జాతీయ కుమార్తెల దినోత్సవం..

ప్రతీ ఏడాది సెప్టెంబర్ నాలుగో ఆదివారం రోజు జాతీయ కుమార్తెల దినోత్సవాన్ని జరుపుకుంటారు. తల్లిదండ్రుల జీవితాల్లో ఆనందాన్ని తెచ్చిన కుమార్తెలను గౌరవించాలనే ఉద్దేశంతో సామాజిక కార్యకర్త రామచంద్ర సిరాస్ 2007లో కుమార్తెల దినోత్సవాన్ని ప్రవేశపెట్టారు.

author-image
By Kusuma
New Update
daughters day

Daughters Day : జీవితాల్లో ఎన్నో కలలు నింపిన కుమార్తెలను గౌరవిస్తూ.. ఏటా సెప్టెంబర్ నాలుగో ఆదివారం రోజున జాతీయ కుమార్తెల దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. మదర్స్ డే, ఫాదర్స్ డేను ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో.. అలాగే ఈ డాటర్స్ డే‌ను కూడా ఘనంగా జరుపుకుంటారు. కుమార్తెలు జీవితంలో విద్య, ఉద్యోగం అన్నింట్లో మంచి స్థాయికి ఎదగాలని వారి భద్రతకు అవగాహన కల్పించే విధంగా ఏటా ఈ దినోత్సావాన్ని జరుపుకుంటారు. సెప్టెంబర్ నాలుగో ఆదివారం అయిన ఈరోజు 22వ తేదీన కుమార్తెల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు.  

దీని చరిత్ర ఏంటి?
ప్రతి కుటుంబంలో కుమార్తెలు ముఖ్యమైన పాత్ర వహిస్తారు. వీరిని గౌరవించాలనే ఉద్దేశంతో సామాజిక కార్యకర్త రామచంద్ర సిరాస్ 2007లో కుమార్తెల దీనోత్సవాన్ని ప్రవేశపెట్టారు. కూతురు విలువపై అవగాహన కల్పించాలని, అందరూ లింగ సమానత్వాన్ని పాటించాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత ఐక్యరాజ్య సమితి 2015లో దీనిని అంతర్జాతీయ దినోత్సవంగా కూడా గుర్తించింది. అమ్మాయిలు ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నింటి మీద ప్రజల్లో అవగాహన కల్పించాలని, అన్ని రంగాల్లో వీరికి అవకాశాలు ఉండేలా ఏటా ఈ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. 

ఎలా జరుపుకోవాలంటే?
కుమార్తెల దినోత్సవం రోజున కొంత సమయం అయిన వారితో గడపండి.  మీ కుమార్తెలు పడుతున్న ఇబ్బందులు అడిగి తెలుసుకోండి. కుమారుడు, కుమార్తె అనే బేధం లేకుండా సమానం చూడండి. విద్య, ఉద్యోగాలు.. ఇలా అన్ని రంగాల్లో విజయం సాధించే దిశగా వారిని సపోర్ట్ చేయండి.

Also Read :  నేటి నుంచి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష

Advertisment
తాజా కథనాలు