Blue Tea: బ్లూ టీ..! ఈ టీ గురుంచి చాలా తక్కువ మందికి తెలుసు. బ్లాక్ టీ తెలుసు, గ్రీన్ టీ తెలుసు. కానీ ఈ బ్లూ టీ ఏంటి అనుకుంటున్నారా..? అయితే.. దీని ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మీరు షాక్ అవ్వాల్సిందే. శంఖపుష్ప అనే నీలిరంగు పువ్వుతో తయారు చేస్తారు. ఈ శంఖపుష్ప టీలో ట్రోపేన్ ఆల్కలాయిడ్స్ లాంటి బలమైన యాంటిసైకోటిక్ ప్లాంట్ కాంపౌండ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది ఒత్తిడిని తగ్గించి, మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది.
శారీరక శక్తిని మెరుగుతుంది:
బ్లూ టీ జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, శారీరక శక్తిని మెరుగుపరచడంలో కీలకంగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఈ బ్లూ టీ బాడీ పెయిన్స్‌ని కూడా నివారిస్తుందంటున్నారు నిపుణులు. బ్లూ టీ, జీర్ణ ఎంజైమ్‌లను ఉత్తేజపరిచి.. అజీర్ణం, ఉబ్బరం, గ్యాస్ట్రిక్ సమస్యలను నివారిస్తుంది.
ఇది కూడా చదవండి: రక్తదానంతో ఈ వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది!