Mobile: నేటి కాలంలో చాల మందికి మొబైల్స్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు లేకుండా జీవించడం అసాధ్యంగా మారింది. ప్రతి ఒక్కరి జీవితంలో ఫోన్లు, సోషల్ మీడియా ఒక భాగంగా మారిపోయాయి. రోజంతా ఫేస్ బుక్, ఇన్స్టా, ట్విట్టర్ అంటూ సోషల్ మీడియాలోనే గంటల తరబడి గడిపేస్తున్నారు. కొంతమంది అయితే ఫోన్లలో బయట ప్రపంచాన్నే మరిచిపోయేంతలా ఫోన్లలో నిమగ్నమైపోతున్నారు. అలాంటిది 8 గంటల పాటు ఎలాంటి ఫోన్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు లేకుండా ఉండగలమని ఊహించుకోగలరా ..? కనీసం ఫోన్ చూడాలనే ఆలోచన కూడా రాకుండా ఉండడం సాధ్యమేనా? అవును.. సాధ్యమే.. ఇటీవలే చైనాలో నిర్వహించిన ఓ పోటీలో ఒక మహిళ మొబైల్ లేకుండా 8 గంటల పాటు ఉండగలిగి .. రూ లక్ష గెలుచుకుంది.
ఓ నివేదిక ప్రకారం.. చైనాలోని చాంగ్‌కింగ్ మునిసిపాలీటీలో ఓ ప్రత్యేకమైన పోటీ నిర్వహించారు. ఇందులో పాల్గొనేవారు మొబైల్ ఫోన్స్, ఎలాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు లేకుండా 8 గంటల పాటు బెడ్ పై ఉండడం ఈ పోటీ ఉద్దేశం. కేవలం టాయిలెట్ బ్రేక్‌ల కోసం మాత్రమే మంచం విడిచి వెళ్ళాలి. అది కూడా 5 నిమిషాలు మాత్రమే. ఈ పోటీలో 100 మందికి పైగా పాల్గొన్నారు.
8 గంటల పాటు బెడ్ పైనే
అయితే ఇక్కడ ఒక కండీషన్ పెట్టారు. ఈ పోటీలో పాల్గొనేవారు మంచం పై నిద్రపోవడానికి వీలులేదు. అలాగే ఎలాంటి ఒత్తిడి, అశాంతికి చూపకూడదు. దీని కోసం వారి చేతికి ఆందోళనను కొలిచే మెషిన్ ని కట్టి ఉంచారు. కాగా, ఈ పోటీలో ఒక్కొక్కరుగా ఎలిమినేటవగా.. ఒక మహిళ అద్భుత ప్రదర్శన చేసి 100కి 88.99 మార్కులు సాధించి విజయం సాధించింది. పోటీలో గెలిచినందుకు ఈ మహిళకు రూ. 1.2 లక్షల బహుమతి లభించింది.
అయితే ఈ మహిళా 8 గంటల పాటు మంచం మీద గమనీయమైన సమయం గడిపింది. ఎలాంటి డిస్ట్రాక్షన్ లేకుండా ఉండగలిగింది. ఇది ఆమె మొబైల్, ఎలక్ట్రానిక్ పరికరాలపై చాలా తక్కువ సమయం గడుపుతున్నట్లు సూచిస్తోంది. మొబైల్‌లు, ఎలక్ట్రానిక్ పరికరాలు లేకుండా ఎలా జీవించాలో ప్రజలకు నేర్పించడమే ఈ ఇలాంటి పోటీల ముఖ్య ఉద్దేశం. డిజిటల్ డీటాక్స్ అనేది మనిషి శారీరక, మానసిక ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. డిజిటల్ డీటాక్స్ పై చైనాలో తరచూ ప్రచారాలు కూడా నిర్వహిస్తుంటారు. ప్రతిరోజు కొంత సమయమైనా మొబైల్స్, సోషల్ మీడియాకు దూరంగా ఉండడం అలవాటు చేసుకోవాలి.
గతంలో UKలో కూడా ఇలాంటి పోటీ నిర్వహించగా.. ఒక చైనీస్ పీహెచ్‌డీ విద్యార్థి ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించకుండా 134 రోజుల్లో చైనాలోని 24 ప్రధాన నగరాలన్నీ ప్రయాణించాడు.
Also Read: రచ్చ లేపుతున్న మంచు ఫ్యామిలీ ఫైట్.. ముంబై పారిపోయిన మంచు లక్ష్మి!