Chandra Grahan 2026: చంద్రగ్రహణం తర్వాత స్నానం చేసి దానం చేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా?

హోలీకి ముందు చంద్రగ్రహణం సంభవిస్తోంది. ఈ గ్రహణం భారతదేశంలో కొన్ని నిమిషాలు మాత్రమే కనిపించనుంది. మత విశ్వాసాల ప్రకారం.. చంద్రగ్రహణానికి తొమ్మిది గంటల ముందు సూతక కాలం ప్రారంభమవుతుంది.

New Update
Chandra Grahan

హోలీకి ముందు చంద్రగ్రహణం సంభవిస్తోంది. ఈ గ్రహణం భారతదేశంలో కొన్ని నిమిషాలు మాత్రమే కనిపించనుంది. మత విశ్వాసాల ప్రకారం.. చంద్రగ్రహణానికి తొమ్మిది గంటల ముందు సూతక కాలం ప్రారంభమవుతుంది. సూతక కాలం ప్రారంభమయ్యే ముందు ఆలయ తలుపులు మూసివేస్తారు. అలాగే చంద్రగ్రహణం రోజు కాశీలో అనేక మార్పులకు దారితీసింది. కాశీ విశ్వనాథ ఆలయం నుండి సంకట మోచన్ దర్బార్ వరకు గ్రహణానికి ముందు కొన్ని ఆలయాలు క్లోజ్ కానున్నాయి.

మంగళవారం (మార్చి 3) రోజున చంద్రగ్రహణం సాయంత్రం 5:59 గంటలకు చంద్రోదయంతో ప్రారంభమై 48 నిమిషాల తర్వాత 6:47 గంటలకు ముగుస్తుంది. సూతక్ ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది. సూతక్ కాలానికి ముందు అన్ని దేవాలయాలు తలుపులు మూసివేస్తారు. అలాగే కాశీ విశ్వనాథ ఆలయం గ్రహణానికి గంటన్నర ముందు మూసివేయనున్నారు. 

విశ్వనాథ ఆలయ ముఖ్య కార్యనిర్వహణాధికారి విశ్వభూషణ్ మిశ్రా మాట్లాడుతూ.. మార్చి 3వ తేదీ సాయంత్రం 4:30 గంటలకు కాశీ విశ్వనాథ ఆలయ తలుపులు మూసివేయబడతాయని, ఆ తర్వాత రాత్రి 7:15 గంటలకు సాధారణ భక్తుల కోసం తలుపులు తెరుచుకుంటాయని తెలిపారు.

ప్రధాన దేవాలయాలు క్లోజ్

వారణాసిలోని ప్రసిద్ధ దుర్గా ఆలయం, సంకట్ మోచన్ ఆలయం, కౌడి దేవి, కాల భైరవుడు, బిర్లా ఆలయం, ఇస్కాన్ ఆలయం, త్రిదేవ్ ఆలయం, బాడా గణేష్, గౌరీ కేదారేశ్వర్, తిల్భాండేశ్వర్, ఇతర దేవాలయాల తలుపులు ఉదయం 8 నుండి 9 గంటల మధ్య మూసివేస్తారు. గ్రహణం ముగిసిన తర్వాత ఈ దేవాలయాలు తిరిగి తెరుచుకుంటాయి.

ఈ దేశాలలో చంద్రగ్రహణం

భారతదేశంతో పాటు తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, పసిఫిక్ మహాసముద్రం, ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం, పాకిస్తాన్, శ్రీలంక, మాల్దీవులు, రష్యా, కజకిస్తాన్, అమెరికా, బ్రెజిల్, గ్రీన్లాండ్, ఆఫ్ఘనిస్తాన్లలో వివిధ సమయాల్లో ఈ గ్రహణం కనిపిస్తుంది.

చంద్రగ్రహణం తర్వాత స్నానం చేసి దానం చేస్తే

చంద్రగ్రహణం తర్వాత గంగా నదిలో స్నానం చేస్తే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ గంగా నదిలో స్నానం చేయలేకపోతే ఇంట్లో ఒక బకెట్‌లో కొన్ని చుక్కల గంగానది నీటిని పోసి ఆ నీటితో స్నానం చేయాలని అంటున్నారు. గంగాజలంతో స్నానం చేసిన తర్వాత దానం చేస్తే మంచి జరుగుతుందని నమ్మకం. శాస్త్రాల ప్రకారం.. సాధారణ రోజుల్లో చేసే దానం కంటే గ్రహనం తర్వాత చేసే దానానికి కోటి రెట్లు ఎక్కువ ఫలితం ఉంటుందని నమ్ముతారు. వాటిలో బియ్యం, పప్పులు, పాత బట్టలు, వీలైతే కొంత డబ్బును పేదవారికి దానం చేయడం వల్ల ఇంట్లో శిరిసంపదలు పెరుగుతాయని కొందరి నమ్మకం. అంతేకాకుండా జాతకంలో గ్రహాల స్థితి బాగోలేనివారు ఇలాంటి సమయంలో దానం చేస్తే ఆ గ్రహాల ప్రతికూలతను తగ్గిస్తాయని బాగా నమ్ముతారు. 

Advertisment
తాజా కథనాలు