/rtv/media/media_files/2025/09/02/chandra-grahan-2025-2025-09-02-16-51-51.jpg)
Chandra Grahan 2025 full information
Chandra Grahan 2025: మరికొన్ని గంటల్లో ప్రపంచంలోని అనేక దేశాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించనుంది. చంద్రుడు, భూమి, సూర్యుడు ఒకే సరళ రేఖ పైకి రావడం వల్ల.. చంద్రుడి నుంచి వచ్చే కాంతిని భూమి అడ్డుకుంటుంది. ఈ సమయంలో అంతా చీకటిగా మారిపోతుంది. దీనినే సంపూర్ణ చంద్రగ్రహణం అంటారు. ఇంగ్లీష్ ఓ ల్యూనార్ ఎక్లిప్స్ అని కూడా అంటారు. 2025లో వస్తున్న రెండవ చంద్రగ్రహణం ఇది. మొదటిది మార్చిలో సంభవించింది. ఈరోజు రాత్రి 9:58 గంటలకు గ్రహణం ప్రారంభమై.. అర్థ రాత్రి 1:28కు ముగుస్తుంది.
అయితే జోతిష్య నిపుణులు ప్రకారం.. గ్రహణ సమయంలో, అలాగే గ్రహణానికి 9 గంటల ముందు నుంచి సూతకాలం(అశుభ సమయం) మొదలవుతుంది. ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు, పూజలు చేయరాదు. అలాగే సూతక కాలం ప్రారంభమైన తర్వాత ఎటువంటి ఆహారం తీసుకోకూడదు. ముందుగానే వండిన ఆహార పదార్థాలపై దర్భలు లేదా తులసి ఆకులు వేయాలి. గ్రహణ సమయంలో ప్రెగ్నెంట్ లేడీస్ బయటకు వెళ్లడం, చంద్రుడిని చూడడం మానుకోవాలి. గ్రహణం సమయంలో భగవంతుని నామాన్ని జపించడం, ధ్యానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే గ్రహణం ముగిసిన తర్వాత కూడా కొన్ని నియమాలను పాటించాలి. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.
గ్రహణం తర్వాత చేయాల్సిన పనులు
శుద్ధి
గ్రహణం ముగిసిన తర్వాత శుభ్రంగా తలంటు స్నానం చేసి, ఇంటిని కూడా శుద్ధి చేసుకోవాలి. అలాగే పూజ గదిని, దేవుడి పఠాలను శుభం చేసి దేవుళ్ళకు పూజ చేసుకోవాలి. ఇంట్లోని అన్ని వస్తువులపై గంగా జలాన్ని చల్లి వాటిని శుద్ధి చేయాలి.
దానాలు:
జ్యోతిష్య నిపుణుల ప్రకారం.. గ్రహణం ముగిసిన తర్వాత కొన్ని వస్తువులను దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. బియ్యం, పాలు, చక్కెర వంటి తెల్లటి వస్తువులను పేదలకు దానం చేయాలి.
రాశి ప్రకారం దానాలు
మేష రాశి: తెల్లని వస్త్రాలు, చక్కెర
కర్కాటక రాశి: బియ్యం, పాలు, బెల్లం, మినుములు
మీన రాశి: పంచలోహ పాత్రలు, పాలు, బియ్యం, మినుములు, బెల్లం.. ఈ సమాచారం కేవలం ఇంటర్నెట్ లో దొరికిన నివేదికల ప్రకారం ఇవ్వబడించింది. దీనిని దృ వీకరించబడలేదు.