Vatican City: ప్రపంచంలోని అనేక దేశాలలో వివిధ రకాల రహస్య విషయాలు ఉన్నాయి. ఇంత వరకు బిడ్డ పుట్టని దేశం ఉంది. 1929 ఫిబ్రవరి 11న ఈ దేశం ఏర్పడి 95 ఏళ్లు గడిచినా ఇక్కడ ఒక్క బిడ్డ కూడా పుట్టకపోవడమే ఆశ్చర్యం. రోమన్ క్యాథలిక్ క్రైస్తవ మతానికి చెందిన ప్రముఖ మత పెద్దలందరూ ఇక్కడ నివసిస్తుంటారు. అదే వాటికన్ సిటీ.. పోప్ కూడా ఇక్కడే నివసిస్తుంటారు. ఇది ప్రపంచంలోనే అతి చిన్న దేశం. ఈ దేశంలో ఒక్క హాస్పిటల్ కూడా ఉండదు. ఇక్కడ ఎవరైనా తీవ్ర అస్వస్థతకు గురైతే దేశం వెలుపల ఉన్న ఆస్పత్రికి పంపడం జరుగుతూ ఉంటుంది. వాటికన్ సిటీలో ఆస్పత్రి చిన్నదిగా ఉండటం, చుట్టుపక్కల ప్రాంతాల్లో అద్భుతమైన వైద్య సదుపాయాలు ఉండటంతో ఆస్పత్రిని తెరవకూడదని నిర్ణయించినట్లు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: క్యాన్సర్‌కు AIతో చికిత్స.. ఎలాగంటే?
వాటికన్ సిటీలో శాశ్వత పౌరసత్వమే కారణమ..?
వాటికన్ సిటీ వైశాల్యం 118 ఎకరాలు మాత్రమే. ఇక్కడ ప్రసవ గది, ఆస్పత్రులు సరిగాలేకపోవడంతో ఇక్కడ ఎవరూ బిడ్డకు జన్మనివ్వడం లేదు. ఇక్కడ సహజ ప్రసవానికి కూడా అనుమతి లేదు. మహిళ ప్రసవ సమయం దగ్గరపడగానే ఇక్కడి నిబంధనల ప్రకారం బిడ్డకు జన్మనిచ్చే వరకు వెళ్లిపోవాల్సిందే. ఇది చాలా కఠినమైన నియమం. అందుకే ఇక్కడ బిడ్డకు జన్మనివ్వడం సాధ్యం కాదు. దీనికి చట్టపరమైన కారణం కూడా ఉంది. వాటికన్ సిటీలో ఎవరూ శాశ్వత పౌరసత్వం పొందరు, నివాసితులందరూ కొంతకాలం వరకే ఇక్కడ ఉంటారు. శాశ్వత పౌరసత్వం లేని కారణంగా ఇక్కడ బిడ్డలను కనలేరు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.
ఇది కూడా చదవండి: ఒక గూడులో వందకు మించి గుడ్లుపెట్టే పక్షి ఏంటో తెలుసా..?