Butterflies: సీతాకోకచిలుకల రెక్కల్లో ఇన్ని రంగులు ఎందుకు? సీతాకోక చిలుకలు విభిన్న రంగులు ఉండే వీటి రెక్కలు చూసేందుకు కనువిందు చేస్తాయి. సీతాకోకచిలుకలు ప్రపంచంలోని అత్యంత రంగుల జీవులలో ఒకటిగా పరిగణించబడుతున్నాయి. సీతాకోక చిలుకల రెక్కలు ఇంద్ర ధనస్సు వంటి రంగులను సృష్టిస్తాయి. By Vijaya Nimma 09 Nov 2024 in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update షేర్ చేయండి 1/6 రంగురంగుల సీతాకోక చిలుకలను ఇష్టపడని వారు ఉండరు. సహజంగానే విభిన్న రంగులు ఉండే వీటి రెక్కలు చూసేందుకు కనువిందు చేస్తాయి. 2/6 సీతాకోకచిలుకలు ప్రకృతిలో అద్భుతమైన జీవులు. సీతాకోక చిలుకలు ఎగురుతున్నప్పుడల్లా వాటి ప్రకాశవంతమైన రంగురంగుల రెక్కలు చూసి ఆకర్షితులం అవుతుంటాం. 3/6 సీతాకోకచిలుకలు ప్రపంచంలోని అత్యంత రంగుల జీవులలో ఒకటిగా పరిగణించబడుతున్నాయి. వాటి రెక్కల రంగు, ఆకారం వాటికి ప్రత్యేకత తీసుకొస్తున్నాయి. 4/6 సీతాకోకచిలుకల రెక్కలు మెలనిన్ వంటి రంగు వర్ణద్రవ్యాలను కలిగి ఉంటాయి. ఇది రెక్కలకు గోధుమ లేదా నలుపు రంగు ఇస్తుంది. కెరోటినాయిడ్లు, ఫ్లేవనాయిడ్లు కూడా వీటి రెక్కలకు పసుపు, నారింజ, ఎరుపు రంగును అందిస్తాయి. 5/6 ఇరిడెసెన్స్ వల్ల కూడా సీతాకోక చిలుకల రెక్కలకు రంగు వస్తుంది. ఇరిడెసెన్స్ అనేది ఒక వస్తువు రంగును చూసే విధానాన్ని బట్టి మారే స్వభావం కలిగి ఉంటుంది. 6/6 సీతాకోకచిలుకలు వాటి రెక్కలలో వివిధ కోణాలలో కాంతిని ప్రతిబింబించే సూక్ష్మ నిర్మాణాలను కలిగి ఉంటాయి. ఇంద్రధనస్సు వంటి రంగులను సృష్టిస్తాయి. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి