DMD: మగపిల్లలను వేధిస్తున్న ప్రాణాంతక వ్యాధి.. చచ్చుబడిపోతున్న శరీరాలు

రామ, ఆదిత్య అనే ఇద్దరు అన్నదమ్ములు 'డుచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ' వ్యాధి బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. జన్యువులోపం వల్ల మగ పిల్లలో సంభవించే రుగ్మతపై సినీ నటుడు అవసరాల శ్రీనివాస్ అవగాహన కల్పిస్తున్నారు. దీని గురించి మరింత ప్రచారం చేయాలని కోరుతున్నారు.

New Update
boys

DMD: డుచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ (DMD) దీనిని 'పీడియాట్రిక్ న్యూరోమస్కులర్ డిజార్డర్' అని కూడా అంటారు. ఇది ఒక జన్యుపరమైన వ్యాధి. ప్రధానంగా మగ పిల్లలను ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి కారణంగా కండరాల బలహీనత ఏర్పడుతుంది. సాధారణంగా నాలుగు సంవత్సరాల వయస్సులో మొదలై ఊహించనంత వేగంగా వ్యాప్తి చెందుతుంది. అయితే జన్యువులోపం వల్ల మగ పిల్లలో సంభవించే వంశపారంపర్య నాడీ కండరాల రుగ్మతగా వైద్యులు పేర్కొన్నారు. ఇది సోకిన వారు తీవ్రమైన కండరాల క్షీణతకు లోనవుతారు. నడవలేకపోవడం, శ్వాసకోశ ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇటీవల రామ, ఆదిత్య అనే ఇద్దరు అన్నదమ్ములు డుచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ వ్యాధి బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది.

తోబుట్టువులందరికీ వచ్చే అవకాశం..
ఈ అన్నదమ్ములిద్దరూ నాలుగేళ్లపాటు చాలా సాధారణంగా ఉన్నారు. పిల్లలు చేసే పనులు.. క్రికెట్, ఫుట్‌బాల్, దూకడం, పరిగెత్తడం వంటివి అన్నీ సక్రమంగా చేశారు. అయితే కొన్నాళ్లకు పెద్దవాడు శారీరకంగా బలహీనంగా ఉన్నాడని తల్లిదండ్రులు గ్రహించారు. దీంతో వైద్యులను సంప్రదించగా పరీక్షలు నిర్వహించి కంగుతిన్నారు. వెంటనే తమ్ముడు ఆదిత్యకు సైతం టెస్టులు చేయగా.. ఇద్దరూ మస్కులర్ డిస్ట్రోఫీ వ్యాధిబారిన పడ్డట్లు పేరెంట్స్ కు తెలిపారు. ఒకే తల్లి గర్భంలో పుట్టిన తోబుట్టువులందరికీ ఈ వ్యాధి సోకే అవకాశం 99% ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం దీనికి చికిత్స అందుబాటులో లేదని, కొంతకాలం ఇలాగే జీవించి చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు. ఈ వ్యాధిబారిన పడిన పిల్లలు యుక్తవయస్సు దాటి లేరని చెప్పారు.

తల్లిదండ్రులకు కడుపుకోత..
అయితే ఈ వ్యాధి గురించి అవగాహన కల్పించడంలో సహాయం చేయమని రామ, ఆదిత్య తల్లిదండ్రులు తనను కోరారని సినీ నటుడు అవసరాల శ్రీనివాస్ తెలిపారు. గర్భం దాల్చిన 3వ నెలలో దాదాపు రూ. 3000 రూపాయలకే తల్లి ప్రీ-నేటల్ టెస్ట్ చేయించుకోవాలని శ్రీనివాస్ సూచించారు. పిండానికి DMD ఉన్నట్లు గుర్తించినట్లయితే ఆ సమయంలో గర్భం రద్దు చేసుకునే అవకాశం ఉందన్నారు. దయచేసి దీనిగురించి మరింత ప్రచారం చేయాలని, తద్వారా ఏ తల్లిదండ్రులకు కడుపుకోత మిగలదని అవసరాల శ్రీనివాస్ కోరుతున్నారు.

Advertisment
తాజా కథనాలు