Ai:భారత్ లో, Save Mom పేరుతో ఏఐ పైలట్ ప్రాజెక్టు ప్రారంభమైంది. ఇది గర్భిణులు, నవజాత శిశువులు, పాలిచ్చే తల్లుల ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తుంది. ఇది పూసల దండలను పోలిన ఏఐ స్మార్ట్ గ్యాడ్జెట్. వీటిని గర్భిణులు వారి మేడలో వేసుకోవాలి. ఈ స్మార్ట్ గ్యాడ్జెట్లు స్థానిక ఆశా కార్యకర్తలు మొదలుకొని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేట్ క్లినిక్‌లతో అనుసంధానమై ఉంటాయి.
Also Read: టాబ్లెట్స్‌కి జబ్బు ఎక్కడుందో ఎలా తెలుస్తుంది?
ప్రసవం అయ్యేవరకూ గర్భిణుల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తాయి. ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్లాలో, ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలో చెబుతాయి. ఏదైనా సమస్య వస్తే.. వెంటనే స్థానిక ఆశా కార్యకర్తలు, వైద్యాధికారులకు సందేశాలు పంపుతాయి. ఇలా.. గర్భిణులతోపాటు పుట్టిన శిశువుల సంరక్షణ కోసం కూడా వెయ్యి రోజులపాటు ఫాలోఅప్ చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే బెంగుళూరులో అందుబాటులోకి వచ్చింది. త్వరలో తెలుగురాష్ట్రాల్లోకి కూడా రానుంది.