Vertical Farming: ప్రపంచ వ్యాప్తంగా సాగు భూమి వేగంగా తగ్గిపోతోంది. మరోవైపు ఆహార పదార్థాల సరఫరా, ఉత్పత్తి ఎప్పుడూ సవాలుగానే ఉంటోంది. అందువల్ల వ్యవసాయోత్పత్తిని పెంచేందుకు కొత్త సాంకేతికతలపై పరిశోధనలు పనిచేస్తున్నారు నిపుణులు.
Also Read: థ్రిల్లర్స్ అంటే ఇష్టమా? అయితే ఈ సినిమా చూడండి..స్ట్రీమింగ్ ఎక్కడంటే ?
వర్టికల్ ఫార్మింగ్
ఈ పరిస్థితుల్లో ఒక కొత్తరకం వ్యవసాయ విధానం ప్రపంచం మొత్తం దృష్టిని ఆకర్షిస్తోంది. పొలంలో మాత్రమే కాదు.. ఇళ్ళు, బహిరంగ ప్రదేశాలు, ఎత్తైన గోడలు పై కూడా చాలు పంట సాగు చేయొచ్చు. ఈ విధానాన్ని వర్టికల్ ఫార్మింగ్ అంటారు. వర్టికల్ ఫార్మింగ్ మూడు రకాలు. వీటిలో హైడ్రోపోనిక్స్, ఆక్వాపోనిక్స్ , ఏరోపోనిక్స్ పద్ధతులు ఉన్నాయి. హైడ్రోపోనిక్స్ పద్ధతిలో సాగు చేసే పంటకు నేల ఉపయోగం ఉండదు. మొక్కలు ఒక ద్రావణంలో పెరుగుతాయి.
Also Read: అలా చేస్తే వచ్చే పాపులారిటీ అక్కర్లేదు.. వైరలవుతున్న సాయి పల్లవి కామెంట్స్
ఏరోపోనిక్స్ పద్ధతి
ఏరోపోనిక్స్ అనేది మట్టి లేకుండానే మొక్కలను పెంచే పద్ధతి. మొక్కలు మూలాలు లేదా వేర్లు గాలిలో నిలిపివేయబడతాయి. ఈ మొక్కల కాండలకు పోషకాలతో కూడిన ద్రావణాన్ని అటామైజ్డ్ లేదా స్ప్రేడ్ రూపంలో చల్లుతారు.
Also Read: Diwali 2024: దీపావళికి ఇల్లంతా దీపాలు.. ఎందుకో తెలుసా? అసలు కథ ఏంటి?