/rtv/media/media_files/2025/12/04/herbal-oils-2025-12-04-13-36-23.jpg)
Herbal Oils
Herbal Oils: జుట్టు రాలడం, పల్చ బడడం సమస్యలు ఎదుర్కొంటున్నారా? అయితే, హార్మోన్ల లేదా కెమికల్స్‌కు బదులుగా, హెర్బల్ ఆయిల్స్ ద్వారా జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చు. శాస్త్రీయంగా ప్రూవ్ అయిన కొన్ని ఆయిల్స్ జుట్టు వృద్ధికి, చుండ్రుల (split ends) నివారణకు, తేమను అందించడానికి సహాయపడతాయి. ఈ చలికాలంలో ఈ 5 హెర్బల్ ఆయిల్స్‌ని ఉపయోగించడం ఉత్తమం.
1. ఆర్గాన్ ఆయిల్ Argan oil
ఆర్గాన్ ఆయిల్ విటమిన్ E, ఫ్యాటీ ఆసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్‌తో నిండినది. ఇది స్కాల్ప్‌ను తేమగా ఉంచి జుట్టు రూట్లను బలంగా చేస్తుంది, బ్రేకేజ్ తగ్గిస్తుంది. జుట్టు ఫోలికల్స్ ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవడం వల్ల కొత్త జుట్టు వృద్ధి కొరకు సహాయపడుతుంది. దీని ఉపయోగంతో జుట్టు పొడవుగా ఆరోగ్యంగా కనిపిస్తుంది.
2. టీ ట్రీ ఆయిల్ Tea Tree Oil
టీ ట్రీ ఆయిల్ తక్కువ డెన్సిటీ కలిగి ఉండి జుట్టు ఫోలికల్స్‌ను బ్లాక్ చేయదు. ఇది ఆంటీ-ఫంగల్, ఆంటీ-బాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉండి డ్యాండ్రఫ్, స్కాల్ప్ ఇర్రిటేషన్, చర్మ ఇన్ఫెక్షన్స్ నివారిస్తుంది. ఒక క్యారియర్ ఆయిల్‌తో కలిపి, షాంపూ లేదా సిరమ్‌లో కూడా ఉపయోగించవచ్చు. ఆరోగ్యకరమైన స్కాల్ప్, కొత్త జుట్టు వృద్ధికి సహాయపడుతుంది.
3. పంప్కిన్ సీడ్ ఆయిల్ Pumpkin Seed Oil
పంప్కిన్ సీడ్ ఆయిల్ లో ఫ్యాటీ ఆసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది DHT హార్మోన్‌ను అడ్డుకుంటూ జుట్టు రాలడం తగ్గిస్తుంది. జుట్టు బలంగా, మందంగా, మెరిసేలా చేస్తుంది. దీన్ని క్రమంగా ఉపయోగిస్తే, జుట్టు ఆరోగ్యంగా, మృదువుగా కనిపిస్తుంది.
4. రోజ్మరీ ఆయిల్ Rosemary Oil
రోజ్మరీ ఆకుల నుంచి తీసిన ఆయిల్, స్కాల్ప్ రక్తప్రసరణను మెరుగుపరచి జుట్టు వృద్ధిని ప్రేరేపిస్తుంది. జుట్టు రాలడం, డ్యాండ్రఫ్, ఇర్రిటేషన్ నివారించడం ద్వారా కొత్త ఫోలికల్స్ పెరుగుతాయి. క్యారియర్ ఆయిల్‌తో కలిపి ఉపయోగించవచ్చు.
5. పెపర్ మింట్ ఆయిల్ Peppermint Oil
పెపర్ మింట్ ఆయిల్ మెంథాల్ వలన చల్లదనాన్ని, తలనొప్పి, స్కాల్ప్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. రక్తప్రసరణ పెరిగి ఫోలికల్స్ ప్రేరేపితమవుతాయి, ఇది జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. డ్యాండ్రఫ్ తగ్గిస్తుంది, బ్యాక్టీరియా నుంచి రక్షిస్తుంది, దీని వల్ల జుట్టు బలంగా, ఆరోగ్యంగా కనిపిస్తుంది.
6. క్యాస్టర్ ఆయిల్ Castor Oil
క్యాస్టర్ ఆయిల్‌లో రిసినోలిక్ ఆమ్లం ఎక్కువగా ఉంటుంది, ఇది స్కాల్ప్‌లో రక్తప్రసరణను పెంచి జుట్టు రూట్లకు పోషకాలు చేరుస్తుంది. ఇది జుట్టును బలంగా చేస్తూ బ్రేకేజ్ తగ్గిస్తుంది. కేవలం 1–2 స్పూన్లు క్యాస్టర్ ఆయిల్ ను నార్మల్ ఆయిల్ తో కలిపి, 5-10 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. 30 నిమిషాలు లేదా రాత్రి మొత్తం పెట్టడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. వారం లో 1–2 సార్లు చేస్తే సరిపోతుంది.
జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కోసం సూచనలు
- క్రమం పాటించండి: ప్రతి వారమూ ఆయిల్ మసాజ్ చేయండి.
- నాణ్యతైన ఆయిల్ ఎంచుకోండి: కోల్డ్-ప్రెస్డ్, హెక్సేన్ ఫ్రీ ఆయిల్ ఉత్తమం.
- పోషకాహారం: జింక్, ఐరన్, బయోటిన్ తినండి.
- సరైన శాంపూ ఉపయోగించండి: డాండ్రఫ్ నివారించడానికి.
- హీట్, కెమికల్స్ తగ్గించండి: జుట్టు దెబ్బతినకుండా.
ఈ హెర్బల్ ఆయిల్స్‌ను సక్రమంగా ఉపయోగిస్తే, జుట్టు ఆరోగ్యంగా, బలంగా, పొడవుగా వృద్ధి చెందుతుంది. ప్రత్యేకంగా చలికాలంలో ఈ ఆయిల్స్ అవసరం. మొత్తంగా, ఆర్గాన్, టీ ట్రీ, పంప్కిన్ సీడ్, రోజ్మరీ, పెపర్ మింట్, క్యాస్టర్ ఆయిల్స్ ఈ 6 ఆయిల్స్ జుట్టు ఆరోగ్యానికి శాస్త్రీయంగా సహాయపడతాయి.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
Follow Us