వైవాహిక జీవితం అన్ని సందర్భాల్లోనూ మన ఊహలకు, ఆలోచనలకు తగ్గట్టు ఉండకపోవచ్చు. అలా అని సంసారాన్ని సమస్యల్లోకి లాగడం భావ్యం కాదు. సంసార జీవితంలో ఎంత సర్దుబాటు చేసుకుంటే కేవలం సంతోషం మాత్రమే మీ సొంతమే కాదు.. మీ దాంపత్యం కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుందని మానసిక నిపుణులు అంటున్నారు.
ఇది కూడా చూడండి: ఈ ఏడాది చివరి నాటికి మతిపోయే టెక్నాలజీ.. అంబానీ మరో సంచలన ప్రకటన!
నెల రోజులకే మాటల యుద్ధం..
ప్రతి అమ్మాయి, అబ్బాయి అయిన పెళ్లికి ముందు చాలా కలలు కంటారు. అవన్నీ పక్కన పెట్టేసి పెళ్లయిన నెల రోజులకే మాటల యుద్ధం మొదల పెడుతుంటారు. కేవలం ఒకరు మాత్రమే కాకుండా ఇద్దరు కూడా మాటలతో గొడవలు ప్రారంభించి విడాకుల వరకు తీసుకెళ్తుంటారు.
ఇది కూడా చూడండి: పెప్సీ, కోకా కోలా నుంచి ఇకపై బడ్జెట్ డ్రింక్స్.. కారణమేంటి?
ఇలాంటి చీటిపోటి మాటలు.. ప్రతి ఇంటా ఉంటాయి. అయితే సంసారం సాఫీగా సాగాలంటే ప్రతి దానిని ఎత్తి చూపొద్దు. మీతో ముడిపడి ఉన్న బంధాలు-అనుబంధాలు బాగుండాలంటే..మీ భాగస్వామిని అందరిలోనూ విమర్శించకండి. కొత్త విషయాలను ఆచరిస్తూ...ఆస్వాదిస్తే...మీ దాంపత్యం నిత్య నూతనం ఖాయం.
ఇది కూడా చూడండి: Samantha : ప్రభాస్ - సమంత కాంబోలో మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా?