/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-48-1.jpg)
Pregnancy Tips: తల్లిగా మారడం వల్ల కలిగే ఆనందం, అనుభవం ఏ స్త్రీకైనా అత్యంత విలువైనది. అయితే ఈ ప్రయాణం అంత సులభం కాదు. గర్భధారణ సమయంలో, స్త్రీ శరీరం అనేక శారీరక, మానసిక మార్పులకు గురవుతుంది. ఈ సమయంలో ఆహారపు అలవాట్లు, బరువు, మానసిక స్థితి మహిళల ఆరోగ్యంతో పాటు నిద్రపై కూడా ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. గర్భధారణ సమయంలో మంచి ఆహారంతో పాటు సరైన నిద్ర కూడా చాలా ముఖ్యం. కానీ గర్భధారణ సమయంలో మహిళలు నిద్రించడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. సరైన నిద్ర మార్గం తెలియకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. అయితే ప్రెగ్నెన్సీలో నిద్రించడానికి సరైన మార్గం ఏంటి..? నిద్రించడానికి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాము..
గర్భధారణ సమయంలో స్త్రీలు నిద్రపోయే ముందు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి
వెనుక భాగం లేదా కడుపు పై నిద్రపోకండి
గర్భధారణ సమయంలో స్త్రీలు వెనుక భాగం లేదా కడుపుపై పడుకోకూడదు. ఇలా చేయడం వల్ల స్త్రీ గర్భాశయ ఒత్తిడి నడుము, వెన్నెముక, ప్రేగులపై పడుతుంది. దీని వల్ల శరీరంలో రక్తప్రసరణకు అంతరాయం కలుగుతుంది. దీని ద్వారా కండరాల నొప్పులు, తిమ్మిర్లు వంటి సమస్యలతో బాధపడే అవకాశం ఉంది.
మోకాళ్ల మధ్య దిండు
గర్భధారణ సమయంలో నిద్రిస్తున్నప్పుడు, ఎడమ వైపున మోకాళ్ల మధ్య కనీసం రెండు దిండ్లు ఉంచాలి. ఇలా చేయడం ద్వారా మూత్రాశయం, గర్భాశయం, యోని కండరాళ్ళ పై ఒత్తిడి తగ్గుతుంది. ఇది హాయిగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. మోకాళ్ల మధ్య దిండు పెట్టుకుని పడుకోవడం వల్ల వెన్నునొప్పి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. లేదా మార్కెట్లో ప్రెగ్నెన్సీ పిల్లోస్ అందుబాటులో ఉంటాయి. వాటిని కూడా ఉపయోగించవచ్చు.
నిద్రపోయే ముందు తక్కువ నీళ్లు తాగడం
ప్రెగ్నెన్సీ సమయంలో శరీరం హైడ్రేట్ గా చాలా ముఖ్యం. కానీ రాత్రి నిద్ర విషయానికి వస్తే, పడుకునే ముందు ఎక్కువ నీళ్లను తాగకూడదు. ఇలా చేయడం వల్ల రాత్రిపూట తరచుగా మూత్రవిసర్జన వస్తుంది. ఇది నిద్రకు భంగం కలిగిస్తుంది.
స్పైసీ ఫుడ్ తినడం మానుకోండి
గర్భధారణ సమయంలో రాత్రిపూట స్పైసీ ఫుడ్ తినడం మానేయాలి. ఇలాంటి ఆహారాన్ని రాత్రిపూట తినడం వల్ల ఎసిడిటీ, గుండెల్లో మంట వస్తుంది. దీని కారణంగా నిద్రకు భంగం కలగవచ్చు. గర్భధారణ సమయంలో మంచి నిద్ర పొందడానికి, స్త్రీలు తమను తాము రిలాక్స్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అలాగే మంచి నిద్ర కోసం పడుకునే ముందు ఒక కప్పు వెచ్చని పాలు తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల తల్లికి మంచి నిద్రతో పాటు పుట్టిన బిడ్డకు కూడా శక్తి వస్తుంది.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.