/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2-10.jpg)
Pregnancy Tips: గర్భధారణ సమయంలో, స్త్రీ శరీరం అనేక మార్పులకు గురవుతుంది. మహిళలు అనేక రకాల శారీరక సమస్యలను ఎదుర్కుంటారు. గర్భధారణ సమయంలో సంభవించే సాధారణ సమస్యల్లో ఒకటి కడుపులో పై దురద. ఈ దురద కడుపుపై ఒత్తిడి కారణంగా వస్తుంది. అయితే ఈ దురద వల్ల కొన్నిసార్లు నిద్ర కూడా సరిగ్గా పట్టడం లేదని మహిళలు ఆందోళనకు గురవుతుంటారు. ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే ఈ దురదను కొన్ని నేచురల్ రెమెడీస్ సహాయంతో తగ్గించవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి..
కడుపు పై దురదను తగ్గించే చిట్కాలు
నిమ్మరసం
నిమ్మరసం బ్యాక్టీరియాను తొలగించి చర్మాన్ని మృదువుగా చేస్తుంది. గర్భధారణ సమయంలో కడుపులో దురద నుంచి ఉపశమనం పొందాలంటే, 1 కప్పు నీటిలో 1 టీస్పూన్ నిమ్మరసం కలిపి.. కడుపు పై అప్లై చేయండి. ఈ రెమెడీ చేయడం వల్ల మీరు దురద నుంచి ఉపశమనం పొందుతారు.
పెట్రోలియం జెల్
గర్భధారణ సమయంలో దురద నుంచి ఉపశమనం పొందడానికి, పెట్రోలియం జెల్లీని కడుపు పై అప్లై చేయవచ్చు. పెట్రోలియం జెల్లీ చర్మానికి పోషణతో పాటు దురద నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది.
అలోవెరా జెల్
అలోవెరా జెల్‌లోని యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పొట్ట చర్మం పై తేమను కాపాడుతూ దురదను తగ్గించడంలో సహాయపడతాయి. ఈ పరిహారం చేయడానికి, మీ చేతిలో కొంచెం అలోవెరా జెల్ తీసుకొని పొట్టపై అప్లై చేయండి.
కొబ్బరి నూనే
కొబ్బరి నూనెలో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చర్మానికి పోషణను అందించడంలో, గర్భధారణ సమయంలో దురద నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి. ఈ కొబ్బరి నూనె రెమెడీ చేయడానికి, కొబ్బరి నూనెను మీ చేతులకు తీసుకుని, కడుపుపై సున్నితంగా మసాజ్ చేయండి. ఇలా చేయడం వల్ల దురద నుంచి ఉపశమనం లభిస్తుంది.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
Also Read: ఈ అలవాట్లు మీ గౌరవాన్ని తగ్గిస్తాయి.. వెంటనే మానుకోండి - Rtvlive.com