Diabetes: మహిళల్లో మధుమేహం ప్రమాదకరం..! సంతానోత్పత్తి, గుండె సమస్యలు..!

ప్రపంచవ్యాప్తంగా మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా మహిళల్లో మధుమేహం మరింత ప్రమాదకరమని చెబుతున్నారు నిపుణులు. డయాబెటిక్ మహిళల్లో గుండె జబ్బులు, కిడ్నీ వ్యాధి, అంధత్వం, సంతానోత్పత్తి సమస్యల ప్రమాదం ఎక్కువగా ఉంటుందని సూచిస్తున్నాయి నివేదికలు.

New Update
Diabetes: మహిళల్లో మధుమేహం ప్రమాదకరం..! సంతానోత్పత్తి, గుండె సమస్యలు..!

Diabetes: ప్రపంచవ్యాప్తంగా మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ జీవితకాల వ్యాధికి అన్ని వయసుల స్త్రీలు, పురుషులు భాదితులు అవుతున్నారు. అయితే మధుమేహం తీవ్రత అందరిలోనూ కనిపిస్తున్నా.. మహిళలకు మాత్రం ఇది మరింత ప్రమాదకరమని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మధుమేహం మహిళల్లో గుండె జబ్బులు, కిడ్నీ వ్యాధి, అంధత్వం, సంతానోత్పత్తి సమస్యల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మహిళలకు మధుమేహం ఎంత ప్రమాదకరం? దీని కారణంగా మహిళల్లో ఏ వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది? చక్కెర స్థాయిని ఎలా నిర్వహించాలి? అనేది ఇప్పుడు తెలుసుకుందాము ...

పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్

నిపుణుల ప్రకారం, మధుమేహం అనేది జీవక్రియ రుగ్మత, ఇది రక్తంలో అధిక చక్కెర స్థాయిల కారణంగా సంభవిస్తుంది. అయితే మధుమేహం మహిళల మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. దీనితో బాధపడుతున్న మహిళలు యోని డిచ్ఛార్జ్, యోని దురద, నొప్పి, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, సెక్స్ డ్రైవ్ తగ్గడం, తరచుగా మూత్రవిసర్జన వంటి లక్షణాలను అనుభవించవచ్చు. అంతే కాదు, ఋతు చక్రంలో మార్పుల కూడా వచ్చే అవకాశం ఉంది. అందువల్ల, వారు ఆరోగ్యకరమైన జీవనశైలిని నిర్వహించడం, వారి చక్కెర స్థాయిలను పర్యవేక్షించడం చాలా ముఖ్యం.

publive-image

పునరుత్పత్తి దెబ్బ తినే ప్రమాదం

డయాబెటిక్ మహిళల్లో యోని సరళత తగ్గుతుంది. దీని కారణంగా వారు సంభోగం సమయంలో నొప్పిని అనుభవించవచ్చు. టైప్ 1, టైప్ 2 డయాబెటిస్.. పీరియడ్స్ అసమానతలు, తక్కువ సంతానోత్పత్తి రేటుకు కారణమవుతాయి. డయాబెటీస్ మహిళల్లో ఫెలోపియన్ ట్యూబ్‌ల వంటి పునరుత్పత్తి అవయవాలు ఇన్ఫెక్షన్ కు గురికావడం, దెబ్బతినే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

గుండెపోటు ప్రమాదం 

నివేదికల ప్రకారం, మధుమేహంతో బాధపడుతున్న మహిళలు కూడా గుండెపోటుకు గురయ్యే ప్రమాదం ఉంది. అంతే కాదు డయాబెటిక్ మహిళల్లో కంటి చూపు తగ్గడం, మూత్రపిండాల వ్యాధి, డిప్రెషన్ వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Also Read: Junk Food: మీ పిల్లలు జంక్ ఫుడ్ మానేయాలంటే ఇలా చేయండి .? లేదంటే ఆరోగ్యానికి ప్రమాదం..!

Advertisment
తాజా కథనాలు