Pregnancy: ప్రెగ్నెన్సీలో సీటు బెల్ట్ పెట్టుకుంటే ఏమవుతుంది..? ఎలా ధరించాలి..?

ప్రతి స్త్రీకి, ప్రెగ్నెన్సీ పీరియడ్ చాలా సున్నితమైనది. ముఖ్యంగా ప్రెగ్నెన్సీలో కారులో ప్రయాణిస్తే మరింత జాగ్రత్తగా ఉండాలి. సీటు బెల్ట్ తప్పనిసరిగా ధరించాలి. సీటు బెల్ట్ పొట్టపై కాకుండా కింది భాగం నుంచి ధరించాలి. బెల్ట్ టైట్ గా పెట్టకూడదు. ఇది పొత్తికడుపు పై ఒత్తిడి కలిగిస్తుంది.

Pregnancy: ప్రెగ్నెన్సీలో  సీటు బెల్ట్ పెట్టుకుంటే ఏమవుతుంది..? ఎలా ధరించాలి..?
New Update

Pregnancy: ప్రతి స్త్రీకి, ఆమె గర్భధారణ రోజులు చాలా సున్నితమైనవి. ఈ తొమ్మిది నెలల్లో తనపైనే కాకుండా పుట్టబోయే బిడ్డపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అయితే ఈ సమయంలో గర్భిణులు తమ రోజువారీ పనులు చేసుకునేందుకు చాలా ఇబ్బందులు పడుతుంటారు. సాధారణంగా ఈ సమయంలో స్త్రీలు బయటకు వెళ్ళడానికి కారును ప్రిఫర్ చేస్తుంటారు. అయితే గర్భధారణ సమయంలో కారులో ప్రయాణిస్తున్నప్పుడు సీట్ బెల్ట్ ధరించడం సరైనదేనా? సీటు బెల్ట్ ధరించేటప్పుడు ఏ తప్పులు నివారించాలి? అనేది ఇప్పుడు తెలుసుకుందాము

గర్భిణీ స్త్రీ సీటు బెల్ట్ ధరించాలా?

వాస్తవానికి, సేఫ్ డ్రైవ్ కోసం ప్రయాణిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ సీట్ బెల్ట్ ధరించడం అవసరమని భావిస్తారు. గర్భధారణ సమయంలో ఇది మరింత ముఖ్యమైనది. ఎందుకంటే డ్రైవింగ్ చేసేటప్పుడు గర్భిణీ స్త్రీకి అకస్మాత్తుగా నొప్పి అనిపించకుండా ఉండడానికి.

సీటు బెల్టు పెట్టుకునే విధానం

సీటు బెల్టు కింది భాగాన్ని పొట్ట పైన కాకుండా పొట్ట కింది భాగం నుంచి ధరించాలి. ఇలా కాకుండా పై పొట్ట పై నుంచి ధరిస్తే అసౌకర్యంగా అనిపించవచ్చు.

publive-image

సీటు బెల్టు పెట్టుకునేటప్పుడు చేయకూడని తప్పులు

గర్భిణులు బిగుతుగా ఉండే సీటు బెల్టులు ధరించడం మానుకోవాలి. బిగుతుగా ఉండే సీట్ బెల్ట్ ధరించడం వల్ల పెల్విక్ ప్రాంతం, పొత్తికడుపులో ఒత్తిడి ఉంటుంది. దీని కారణంగా కడుపులో తీవ్రమైన నొప్పిని అనుభవించవచ్చు.

సీటు బెల్ట్ కొద్దిగా వదులుగా ఉంచండి.

సీట్ బెల్ట్ పెట్టుకున్న తర్వాత చాలా మంది స్త్రీలకు వెన్నునొప్పి మొదలవుతుంది. అటువంటి పరిస్థితిలో, వెన్నునొప్పిని నివారించడానికి, స్త్రీ వెన్నుముకకు సపోర్ట్ గా దిండును ఉపయోగించాలి. అలాగే సీట్ బెల్ట్ లూజ్ గా ధరించాలి.

దూర ప్రయాణాలు

గర్భధారణ సమయంలో దూర ప్రయాణాలకు దూరంగా ఉండాలి. లేదంటే మధ్యమధ్యలో విరామం తీసుకుంటూ ప్రయాణం చేయాలి.
గర్భధారణ సమయంలో భద్రతా కారణాల దృష్ట్యా, ఎల్లప్పుడూ నడుము చుట్టూ సీటు బెల్టును గట్టిగా బిగించండి.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Also Read: Janhvi Kapoor: పారిస్ ఫ్యాషన్ వీక్ లో జాన్వీ .. బ్లాక్ డ్రెస్ లో స్టన్నింగ్ లుక్స్ ..! - Rtvlive.com

#pregnancy #seat-belt
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe