Heart Health : గుండె ఆరోగ్యంగా ఉండటానికి సాధారణ కొలెస్ట్రాల్(Cholesterol) స్థాయిని కలిగి ఉండటం చాలా ముఖ్యం. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ అంటే ఎల్‌డిఎల్(LDL) పెరిగినప్పుడు నాళాలలోకి రక్త ప్రసరణ మందగిస్తుంది. దీని కారణంగా గుండె రక్తాన్ని సరిగ్గా పంప్ చేయదు, అది మొత్తం శరీరానికి చేరుకోవడంలో ఆలస్యం అవుతుంది. ఫలితంగా రక్తంతో పాటు ఆక్సిజన్ సకాలంలో శరీరానికి అందదు. దీని వల్ల ఇతర శరీర భాగాల పనితీరు కూడా దెబ్బతింటుంది. అధిక కొలెస్ట్రాల్ వల్ల కలిగే సమస్యలను నివారించడానికి, వైద్యులు మొదట లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్(Lipid Profile Test) అని పిలిచే కొలెస్ట్రాల్ పరీక్ష చేయించుకోవాలని సిఫార్సు చేస్తారు. అయితే మీరు ఈ పరీక్షను పూర్తి చేయాలనుకుంటే, ఈ విషయాలను గుర్తుంచుకోవడం ముఖ్యం. లేదంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ తప్పుగా సూచించబడే ప్రమాదం ఉంటుంది.
కొలెస్ట్రాల్ పరీక్ష లేదా లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష చేయించుకునే ముందు ఈ జాగ్రత్తలు వహించండి
ఆల్కహాల్
మీరు కొలెస్ట్రాల్ పరీక్ష(Cholesterol Test) చేయించుకోవడానికి వెళ్ళినప్పుడల్లా, మీరు 10-12 గంటల ముందు ఎలాంటి ఆహరం తినకుండా ఉండాలని గుర్తుంచుకోండి. నీళ్లు మాత్రమే తాగాలి. గ్రీన్ టీ వంటి ఆరోగ్యకరమైన పానీయం తాగడం కూడా కొలెస్ట్రాల్ పరీక్షలలో తప్పుడు ఫలితాలను ఇస్తుంది. అలాగే కొలెస్ట్రాల్ పరీక్షకు 48 గంటల ముందు ఆల్కహాల్
తీసుకోవద్దు. ఆల్కహాల్ కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది.
ఆయిల్ ఫుడ్స్ కు దూరంగా
కొలెస్ట్రాల్ టెస్ట్ కు వెళ్లే 48 గంటల ముందు కొవ్వు లేదా నూనెతో కూడిన ఆహారాన్ని తినడం మానేయండి. కొవ్వు, జిడ్డుగల ఆహారాలు మీ లిపిడ్ పరీక్ష సంఖ్యలను కూడా తప్పుగా సూచిస్తాయి. హైడ్రేటెడ్ గా ఉండటం ముఖ్యం. పుష్కలంగా నీరు త్రాగుతూ ఉండండి. ఇలా చేయడం వల్ల కొలెస్ట్రాల్ తప్పుగా సూచించవు.
ఒత్తిడికి దూరంగా
కొలెస్ట్రాల్ పరీక్ష కోసం వెళుతున్నట్లయితే, మీ మనస్సును రిలాక్స్ చేయండి , చాలా ఒత్తిడితో కూడిన పనికి దూరంగా ఉండండి. కోపం, అధిక పని వంటి వాటి వల్ల అలసిపోయినట్లు లేదా చాలా ఒత్తిడికి లోనవుతారు. ముందుగా మీ మనస్సును రిలాక్స్ చేసుకోండి. తర్వాత 48 గంటల్లో కొలెస్ట్రాల్ పరీక్ష చేయించుకోండి. ఎందుకంటే ఒత్తిడి కారణంగా శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి కూడా పెరుగుతుంది.
గమనిక : ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.