/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-22T102117.542.jpg)
Kitchen Hacks: వర్షాకాలం ప్రారంభం కాగానే కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని తాకడం ప్రారంభిస్తాయి. అటువంటి సమయంలో ఈ కూరగాయలను సరిగ్గా నిల్వచేసుకోవాలి. లేదంటే అవి త్వరగా పాడై కుళ్ళిపోతాయి. దీని వల్ల డబ్బు వృధా అవుతుంది. వర్షాకాలంలో త్వరగా పాడైపోయే కూరగాయల్లో టమాటో ఒకటి. ఇవి త్వరగా పాడవకుండా ఉండడానికి ఈ చిట్కాలను పాటించండి.
టమాటోలను తాజాగా ఉంచే చిట్కాలు
పసుపు నీరు
అర టీస్పూన్ ఉప్పు, పసుపు కలిపిన నీటిలో టమోటాలు వేసి కాసేపు అలాగే ఉంచాలి. కొంత సమయం తరువాత, పసుపు నీటిలో నుంచి టమోటాలు తీసి, వాటిని శుభ్రమైన నీటితో కడిగి పూర్తిగా తుడిచి పొడిగా ఉంచాలి. ఆ తరువాత, ఒక మూతలేని పాత్రలో సాధారణ కాగితాన్ని
వేసి దాంట్లో టమాటోలను పెట్టండి. ఈ విధంగా నిల్వ చేసిన టమాటాలు వారం రోజుల పాటు తాజాగా ఉంటాయి.
టమోటాలు కడగాలి
టొమాటోలను రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయడానికి ముందు, వాటిని బాగా కడిగి ఆరబెట్టాలి. టమోటాలపై నీరు ఉండకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఆ తర్వాత టమాటోలను ఒక శుభ్రమైన బుట్టలో నిల్వ చేయాలి. టొమాటోలను రిఫ్రిజిరేటర్‌లో నిల్వచేసేటప్పుడు విశాలమైన పాత్రలో ఉంచాలని గుర్తుంచుకోండి. ఒకదానికొకటి తగులుతూ ఇరుక్కుగా ఉండడం వల్ల త్వరగా చెడిపోతాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-22T102137.135.jpg)
మట్టి
టమోటాలు నిల్వ చేయడానికి మట్టిని కూడా ఉపయోగించవచ్చు. ఈ పరిహారం చేయడానికి, ఒక బుట్టలో మట్టిని నింపి, దానిలో టొమాటోలను నొక్కడం వల్ల చాలా రోజులు టమోటాలు చెడిపోకుండా ఉంటాయి. కానీ ఇలా చేస్తున్నప్పుడు, మట్టిలో లేదా టమోటాలలో నీరు ఉండకూడదని గుర్తుంచుకోండి. మట్టి నుంచి టమోటాలు తీసినప్పుడల్లా, మీ చేతులు కూడా పొడిగా ఉండాలని గుర్తుంచుకోండి.
న్యూస్ పేపర్
బయట టమోటాలను నిల్వ చేయాలనుకుంటే, టమోటాలను పెద్ద బుట్టలో వేసి వాటి న్యూస్ పేపర్ కప్పండి. దీని తర్వాత మళ్లీ దాని పైన మరో టొమాటో పొరను వేయండి.
Also Read: Ananth Ambani: ఈ షేర్వానీ డిజైన్ చేయడానికి అన్ని రోజులు పట్టిందా..! - Rtvlive.com
Follow Us