Hypothyroidism: ఈ లక్షణాలు హైపోథైరాయిడిజం సమస్యకు సంకేతాలు.. జాగ్రత్త..! థైరాయిడ్ హార్మోన్ అసమతుల్యత కారణంగా హైపోథైరాయిడిజం సమస్య ఏర్పడుతుంది. దీని కారణంగా అలసట,బలహీనతతో పాటు శరీరంలో అనే మార్పులు కనిపిస్తాయి. కళ్ళ చుట్టూ మొటిమలు, చర్మం పొడిబారడం, జుట్టు రాలడం, గొంతు మారడం జరుగుతుంది. By Archana 27 Jul 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Hypothyroidism: థైరాయిడ్ గ్రంథి తగినంత థైరాయిడ్ హార్మోన్‌ను ఉత్పత్తి చేయకపోవడం వల్ల హైపోథైరాయిడిజం పరిస్థితి ఏర్పడుతుంది. జీవన శైలి, ఆహరపు అలవాట్లు దీనికి ప్రధాన కారణాలుగా ఉంటున్నాయి. హైపో థైరాయిడిజం సమస్య హార్ట్ రేట్, శరీర ఉష్ణోగ్రత, జీవక్రియ సమస్యలను కలిగిస్తుంది. ముఖ్యంగా హైపో థైరాయిడిజం సమస్య వృద్ధుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. హైపోథైరాయిడిజం కారణంగా అలసట, బలహీనత మాత్రమే కాకుండా ముఖంలో అనేక మార్పులు కనిపించడం ప్రారంభిస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము.. ముఖం మీద వాపు హైపోథైరాయిడిజం వల్ల ముఖంపై వాపు వస్తుంది. వాస్తవానికి థైరాయిడ్ హార్మోన్లు చర్మం, జుట్టులో కూడా ఉంటాయి. థైరాయిడ్ హార్మోన్ లోపం వల్ల గ్లైకోసమినోగ్లైకాన్ అనే అణువులు పేరుకుపోవడం ప్రారంభిస్తాయి. దీని కారణంగా ముఖం పై వాపును కలిగిస్తాయి. చర్మంలో అధిక పొడి హైపోథైరాయిడిజం వల్ల చర్మం తరచుగా చర్మం పొడిబారడం జరుగుతుంది. కొన్నిసార్లు చర్మం నుంచి పొలుసులు పడటం ప్రారంభిస్తుంది. జుట్టు రాలడం హైపోథైరాయిడిజం వల్ల జుట్టు కూడా రాలడం మొదలవుతుంది. కనుబొమ్మల వెంట్రుకలు కూడా రాలడం ప్రారంభిస్తాయి. కళ్ళ చుట్టూ మొటిమలు ముఖం మీద, కళ్ళ చుట్టూ మొటిమలు రావడం మొదలవుతాయి. అలాగే వాపు కూడా ఏర్పడుతుంది. వాయిస్ లో మార్పు థైరాయిడ్ హర్మొన్ అసమతుల్యత కారణంగా, వాయిస్ లో మార్పులు సంభవించడం ప్రారంభిస్తాయి. నెమ్మదిగా వాయిస్ పెద్దగా, భారీగా రావడం మొదలవుతుంది. చాలా సార్లు కళ్ళు, ముక్కులో కూడా మార్పులు కనిపిస్తాయి ముక్కు వెడల్పుగా, కళ్ళు పెద్దవిగా కనిపిస్తాయి. దీనికి కారణం థైరాయిడ్ గ్రంధి తక్కువగా పనిచేయడం. Also Read: Life Style: గంటల తరబడి స్క్రీన్స్ ముందు కూర్చుంటున్నారా..? ఈ యోగాసనాలు చేయాల్సిందే..? #hypothyroidism మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి