Brass Vessel: ప్లాస్టిక్, స్టీల్ పాత్ర కాదు.. ఈ కప్పులో టీ తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు..! ఇత్తడి పాత్రలో టీని తయారు చేయడం ఆరోగ్యానికి ఎంతో మేలు అని చెబుతున్నారు నిపుణులు. ఈ పాత్రల్లోని పోషకాలు వండిన ఆహారంతో పాటు నేరుగా శరీరంలోకి చేరి ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఇత్తడి పాత్రలో చేసిన టీ తాగడం ద్వారా జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి, చర్మ ఆరోగ్యం మెరుగుపడతాయి. By Archana 15 Jul 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Brass Vessel: ఉదయాన్నే నిద్ర లేవగానే ప్రతీ ఒక్కరు తమ రోజును చక్కటి టీ లేదా కాఫీతో ప్రారంభిస్తారు. అయితే సాధారణంగా అందరు తమ టీనీ స్టీల్,గాజు లేదా ప్లాస్టిక్ కప్పుల్లో తాగుతుంటారు. కానీ వీటికంటే ఇత్తడి పాత్రలో టీ తాగితే రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మేలని చెబుతున్నారు నిపుణులు. నిపుణుల అభిప్రాయం ప్రకారం కొన్ని లోహాలతో చేసిన పాత్రలలో వండిన ఆహారం మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈ పాత్రల్లోని పోషకాలు వండిన ఆహారంతో నేరుగా శరీరంలోకి చేరి మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఇత్తడి పాత్రలో టీ తయారు చేసి తాగడం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాము. ఇత్తడి పాత్రలో టీ తాగితే కలిగే ప్రయోజనాలు రోగనిరోధక శక్తి బలపడుతుంది రాత్రంతా ఇత్తడి పాత్రలో నిల్వ చేసిన నీటిని ఉదయం ఖాళీ కడుపుతో తాగడం వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తి బలపడుతుంది. దీని వల్ల అనేక రకాల వ్యాధులతో పోరాడే శక్తి శరీరానికి అందుతుంది. అదేవిధంగా, ఆహారాన్ని ఇత్తడి పాత్రలలో తయారు చేసిన ఆహారాలు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. రక్తాన్ని శుద్ధి చేయడం ఇత్తడి పాత్రలలో వండిన ఆహారం లేదా టీలో అధిక మొత్తంలో జింక్ ఉంటుంది. ఇది శరీరంలో బ్లడ్ కౌంట్ పెంచడంలో సహాయపడుతుంది. అంతే కాదు , ఇత్తడి పాత్రల్లో తయారుచేసిన ఆహారం రక్తాన్ని శుద్ధి చేయడంలో తోడ్పడుతుంది. ఇత్తడి ఆహార రుచిని పెంచుతుంది ఇత్తడి పాత్రలలో ఆహారం లేదా టీ వండేటప్పుడు, ఈ పాత్రల నుంచి సహజ నూనె బయటకు వస్తుంది. దీని వల్ల ఆహారానికి సహజ రుచి వస్తుంది. శ్వాసకోశ వ్యాధులను దూరం ఇత్తడి పాత్రల్లో వండిన ఆహారాన్ని తినడం వల్ల ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధులు నయం అవుతాయి. అంతేకాకుండా కఫ, వాత, పిత్త దోషాలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. చర్మ ఆరోగ్యం ఇత్తడి పాత్రలు తగినంత మొత్తంలో మెలనిన్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇవి సూర్యుడి హానికరమైన UV కిరణాల నుంచి చర్మాన్ని రక్షించడంలో సహాయపడతాయి. ఈ మిలీనియం ఎలిమెంట్స్ చర్మాన్ని మెరిసేలా చేయడంలో కూడా సహాయపడతాయి. ఇత్తడి పాత్రల్లో తయారుచేసిన టీని తాగడం వల్ల చర్మ సంబంధిత సమస్యలైన మొటిమలు, ముడతలు మరియు మచ్చలు తొలగిపోవడమే కాకుండా చర్మం ఆరోగ్యంగా, మెరుస్తూ ఉంటుంది. నాణ్యమైన ఇత్తడి పాత్రల్లో మాత్రమే ఆహారాన్ని వండాలి. జీర్ణవ్యవస్థకు మేలు ఇత్తడి పాత్రలో తయారుచేసిన టీ తాగడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఇందులో ఉండే పోషకాలు ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేసి, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. గమనిక ఇత్తడి పాత్రల్లో నిమ్మ, టమాటా వంటి ఆమ్ల ఆహారాలను ఎప్పుడూ కూడా వండకూడదు. పుల్లని మూలకాలు లేదా ఆమ్లాలు కలిగిన ఆహారాన్ని ఇత్తడి పాత్రలో వండితే శరీరానికి హాని కలుగుతుంది. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. Also Read: Banana Stem : ఆ సమస్యతో బాధపడేవారికి.. అరటి కాండం ఔషధం..! - Rtvlive.com #brass #drinking-tea-in-brass-cups మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి