Banana Stem : ఆ సమస్యతో బాధపడేవారికి.. అరటి కాండం ఔషధం..!

అరటి పండు మాత్రమే కాదు కాండతో కూడా ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది శరీరంలో రక్తహీనతను తగ్గిస్తుంది. అరటి కాండలోని ఫైబర్, తక్కువ గ్లైసెమిక్ విలువలు మధుమేహం, అధిక బరువు సమస్యలను నియంత్రించడంలో సహాయపడతాయి.

New Update
Banana Stem : ఆ సమస్యతో బాధపడేవారికి.. అరటి కాండం ఔషధం..!

Health Benefits Of Banana Stem : అరటిపండులోని పుష్కలమైన పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే అరటి పండు మాత్రమే కాదు దాని కాండంతో కూడా ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. అరటి కాండ (Banana Stem) లో ఫైబర్, పొటాషియం, విటమిన్ B6 వంటి పుష్కలమైన పోషకాలు  ఉంటాయి. అరటి కాండం తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాము..

రక్తహీనత

అరటి కాండంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి తోడ్పడుతుంది.

మూత్రపిండాల్లో రాళ్లు, UTI సమస్యలు

అరటి కాండం కిడ్నీ స్టోన్ సమస్యల (Kidney Stone Problems) నుంచి ఉపశమనం కలిగిస్తుంది. రోజు ఒక గ్లాసు అరటి కాండం జ్యూస్ తాగడం వల్ల UTI సమస్యలు దూరమవుతాయి.

శరీర నిర్విషీకరణ (డిటాక్స్)

అరటి కాండం జ్యూస్ తాగడం ద్వారా శరీరం డిటాక్సిఫై అవుతుంది. ఈ రసం శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగించి జీర్ణవ్యవస్థను బలంగా ఉంచడంలో సహాయపడుతుంది. దీనిలోని అధిక ఫైబర్ ప్రేగు కదలిక , ఎసిడిటీ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

బరువు తగ్గడం

బరువు తగ్గాలనుకునే (Weight Loss) వారికి ఆహారంలో అరటి కాండం చేర్చుకోవడం సరైన ఎంపిక. దీనిలోని అధిక మొత్తం ఫైబర్ చాలా సమయం వరకు కడుపు నిండుగా ఉందనే భావనను కలిగిస్తుంది. ఇది అతిగా తినకుండా నిరోధిస్తుంది. తద్వారా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

Banana Stem

మధుమేహం 

అరటి కాండంతో తయారు చేసిన జ్యూస్ మధుమేహ రోగులకు (Diabetes Patients) ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది తక్కువ గ్లైసెమిక్ విలువలను కలిగి ఉంటుంది. దీనిని తీసుకోవడం ద్వారా రక్తంలోని చక్కర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.

అధిక రక్త పోటు

అరటి కాండంలో విటమిన్ B6, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో సోడియం స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. అధిక రక్తపోటు సమస్య ఉన్న వారికి అరటి కాండం చక్కని ఔషధం.

అరటి కాండం ఎలా తీసుకోవాలి

అరటి కాండం జ్యూస్ కోసం, ముందుగా అరటి కాండం పూర్తిగా శుభ్రం చేసి, ఆ తర్వాత పై తొక్కను తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ ముక్కల్లో ఒక కప్పు నీళ్లు గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే ఏలకులు, నిమ్మకాయ లేదా నల్ల ఉప్పు వేసి కూడా తీసుకోవచ్చు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Also Read: Moringa Water: మునగాకు నీటితో ఆ సమస్యలన్నీ మాయం..? - Rtvlive.com

Advertisment
Advertisment
తాజా కథనాలు