Moringa Water: ప్రతిరోజు ఉదయం ముందుగా నీరు త్రాగడం మంచిది. కానీ ఈ నీటిలో ఔషధ మూలకాలు పుష్కలంగా ఉంటే అది శరీరానికి మరిన్ని ప్రయోజనాలను అందిస్తుంది. ఉదయాన్నే మునగాకు నీటిని తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ నీరు అనేక వ్యాధులను నయం చేసే శక్తి కలిగి ఉంటుంది.
పూర్తిగా చదవండి..మునగాకు నీరు ఒక వరం
మునగ ఆకులు, కాండం, పూలు, పండ్లు అన్నీ పోషకాలతో నిండి ఉంటాయి. ఈ ఆకుల నీటిని రోజూ తాగడం వల్ల అనేక పోషకాహార లోపాలకు పరిష్కారం ఉంటుంది.
మొరింగ పొడి
మొరింగ(మునగాకు) నీరు త్రాగడానికి, ముందుకు మునగ ఆకులను ఎండబెట్టి పొడి చేయండి. ఈ పొడిని ఒక చెంచా తీసుకుని ఒక లీటరు నీటిలో ఐదు నిమిషాలు మరిగించాలి. ఆ తర్వాత ఈ నీటిని తాగండి. లేదంటే తాజా మొరింగ ఆకులను నీటిలో వేసి కూడా ఉడకబెట్టవచ్చు. ఈ నీటిని తాగితే కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాము
నొప్పి నుంచి ఉపశమనం
కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ నొప్పి, ఎముకల నొప్పి నుంచి ఉపశమనం అందించడంలో మోరింగ సహాయపడుతుంది. మొరింగలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి వాపును తగ్గించి నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఈ ఆకులలో నొప్పిని తగ్గించే మూలకాలు పాలీఫెనాల్స్ , ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి.
బరువు తగ్గడంలో
మొరింగను కలిపిన నీటిని ప్రతిరోజూ తాగడం ద్వారా జీవక్రియను బలపరుస్తుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. తక్కువ కేలరీలు , పోషకాలు సమృద్ధిగా ఉండటం వల్ల శరీరానికి అవసరమైన పోషణను అందించి.. కడుపు నిండుగా ఉన్న అనుభూతిని ఇస్తుంది.
మధుమేహ రోగులకు వరం
టైప్ 2 డయాబెటిస్ ఉన్న వ్యక్తులో ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడానికి , రక్తంలో చక్కెరను నియంత్రించడానికి మునగాకు నీళ్ళు అద్భుతంగా పనిచేస్తాయి.
శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది
మొరింగలో సహజమైన నిర్విషీకరణ లక్షణాలు ఉంటాయి. ఇవి కాలేయం , మూత్రపిండాలను శుభ్రపరచడంలో సహాయపడతాయి. ఆరోగ్యమైన, దృఢమైన జుట్టుకు కూడా మునగాకు అద్భుతంగా పని చేస్తుంది.
హిమోగ్లోబిన్
తక్కువ హిమోగ్లోబిన్ సమస్య ఉన్నవారు ఉదయాన్నే మునగాకు నీటిని తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఇందులో విటమిన్ ఎ, సి, ఇ, కాల్షియం, పొటాషియం, ఐరన్ పోషకాలు ఉంటాయి. దీని వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: లక్ష్మీ పూజ సరైన పద్ధతి లేకుండా చేస్తున్నారా? ఈ దేవతను ప్రసన్నం చేసుకోండి!Read:
[vuukle]