Asthma: ఆస్తమా ఎందుకు వస్తుంది..? రకాలు కారణాలు

ఆస్తమా ఊపిరితిత్తులలో వాపు, ఇన్ఫెక్షన్ కారణంగా వస్తుంది. అయితే అందరిలో ఆస్తమాకు గల కారణాలు ఒకే విధంగా ఉండకపోవచ్చని చెబుతున్నారు నిపుణులు. కొంతమందిలో ఫుడ్ అలెర్జీ, రసాయనాలు, వాయు కాలుష్యం వంటివి కూడా ఆస్తమాను ప్రేరేపితం చేస్తాయి.

Asthma: ఆస్తమా ఎందుకు వస్తుంది..? రకాలు కారణాలు
New Update

Asthma: ఆస్తమా అనేది ఒకసారి వస్తే జీవితాంతం ఉండే వ్యాధులలో ఒకటి. ఊపిరితిత్తులలోని వాయుమార్గాలలో వాపు, ఇన్ఫెక్షన్ కారణంగా వస్తుంది. కొన్ని సందర్భాల్లో జీన్స్ ద్వారా కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతిలో నొప్పి. జలుబు లేదా ఫ్లూ వంటి సమస్యల తీవ్రత ఎక్కువగా ఉండడం, గురక రావడం, ఊపిరాడకపోవడం ఆస్తమా లక్షణాలు. అయితే ప్రతీ ఒక్కరికీ ఒకే రకమైన లక్షణాలు ఉండాల్సిన అవసరం లేదు. ఆస్తమా అనేది 5 రకాలుగా ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము..

ఆస్తమా రకాలు

సీజనల్ ఆస్తమా

వాతావరణంలో మార్పుల కారణంగా వచ్చే దానిని సీజనల్ ఆస్తమా అంటారు. వాతావరణం చాలా చల్లగా లేదా ఉష్ణోగ్రతలో ఆకస్మిక మార్పులు వచ్చినప్పుడు ఈ ఆస్తమాలక్షణాలు కనిపిస్తాయి. ఊపిరాడకపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతాయి.

అలెర్జీ ఆస్తమా

అలెర్జీతో వచ్చే ఆస్తమా అత్యంత సాధారణమైన రకం.అలెర్జీ ఆస్తమా ఆస్తమాతో బాధపడుతున్న వారిలో 8-10 నుంచి మందిలో ఒకరికి మాత్రమే తామర, అలర్జీ రినైటిస్, ఫుడ్ అలర్జీలు వంటి ఇతర అలర్జీలు కూడా వచ్చే అవకాశం ఉంది. పాల ఉత్పత్తులు, పెంపుడు జంతువుల చర్మం, వాయు కాలుష్యం ఈ రకమైన ఆస్తమాను ప్రేరేపిస్తాయి.

publive-image

ఆక్యుపేషనల్ ఆస్తమా

ఇది వృత్తి పరమైన ఆస్తమా. పని చేసే ప్రదేశాలు, అక్కడి వాతావరణం ఆధారంగా ఈ ఆస్తమా వస్తుంది. నివేదికల ప్రకారం.. USలో 15% వరకు ఆస్తమా కేసులు పెయింట్ రసాయనాలు, ఏరోసోల్స్, పురుగుమందులు వంటి వస్తువులు ఉండే ప్రదేశాల్లో పనిచేసే ఉద్యోగులకు సంబంధించినవి.

నాన్-అలెర్జిక్ ఆస్త్మా

ఈ రకమైన ఆస్తమా ఎక్కువగా పెద్దవారిలో వస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, జన్యుపరమైన, పర్యావరణ కారకాల కారణంగా నాన్-అలెర్జిక్ ఆస్త్మా అభివృద్ధి చెందుతుంది.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Also Read: Swiggy : స్విగ్గీలో అత్యధికంగా ఆర్డర్ చేసిన వెజ్ ఫుడ్స్ ఇవే - Rtvlive.com

#asthma #asthma-types
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe