Health Tips: ప్రతీ ఒక్కరు నిద్ర లేవగానే తమ రోజును ప్రశాంతంగా స్టార్ట్ చేయాలనీ భావిస్తారు. ఉదయం ఎంత ప్రశాంతమైన మనసుతో నిద్ర లేస్తే ఆ రోజంతా చురుకుగా, ఉత్సాహంగా ఉంటుంది. కానీ కొంత మంది ఉదయం లేవగానే తలనొప్పి సమస్యతో బాధపడుతుంటారు. దీని వల్ల రోజంతా చికాకుగా, ఏ పని పై శ్రద్ధ చూపలేకపోతాము. చాలా మంది అసలు నిద్ర లేవగానే తల నొప్పిగా ఉండడానికి కారణమేంటని ఆలోచిస్తారు. మైగ్రేన్ తలనొప్పి, టెన్షన్ ఇలా చాలా కారణాల వల్ల తలనొప్పి వస్తుంది. అసలు ఇలాంటి తలనొప్పులు ప్రేరేపితం చేసే కారణాలేంటో తెలుసుకుందాం..
ఒత్తిడి
ఒత్తిడికి గురైనప్పుడు చాలా మందికి తలనొప్పిగా ఉంటుంది. ఇది అందరిలో సహజంగా కనిపించే సమస్యే. ఒత్తిడి లేదా టెన్షన్ వల్ల కలిగే తల నొప్పి.. తల రెండు వైపుల నొప్పిని ప్రభావితం చేస్తుంది. కండరాళ్ళ పై ఒత్తిడి కారణంగా రెండు వైపుల నొప్పిని కలిగించును. ఒత్తిడి భుజం, మెడ కండరాళ్ళను టైట్ చేసి నొప్పిని మరింత పెంచుతుంది.
ఆల్కహాల్
ఆల్కహాల్ మైగ్రేన్ నొప్పిని ప్రభావితం చేస్తుంది. కొంత మందిలో రెడ్ వైన్ లేదా ఏదైనా ఆల్కాహాల్ కూడా తలనొప్పిని కలిగించును. ఆల్కహాల్, కారణమా లేదా దానిలోని ఏవైనా కాంపౌండ్స్ కారణమా అనేది ఇంకా ప్రశ్న మాత్రమే. నిపుణుల నివేదికల ప్రకారం చాలా మందిలో రెడ్ వైన్ తాగిన తర్వాత విపరీతమైన తలనొప్పి కలుగుతుందని చెబుతున్నారు.వైద్యనిపుణుల అధ్యయనాల ప్రకారం ఆల్కాహాల్ లో 'హిస్టామిన్' అనే కెమికల్ కాంపౌండ్ రోగనిరోధక శక్తిని ప్రభావితం చేసి తలనొప్పికి దారి తీస్తుంది.
హార్మోనల్ చేంజెస్
మైగ్రేన్ సమస్యతో బాధ పడే వారిలో ఈస్ట్రోజెన్ హార్మోన్ ఉత్పత్తిలో తరచూ మార్పులు వస్తుంటాయి. ఆడవాళ్ళలో నెల సరి ఋతుచక్రం, అలాగే వయసు పైబడిన వారిలో మెనోపాస్ మైగ్రేన్ తలనొప్పిని ప్రభావితం చేస్తాయి.
సరైన నిద్ర లేకపోవడం
సరైన నిద్ర లేకపోవడం మైగ్రేన్, టెన్షన్ ద్వారా కలిగే తలనొప్పితో ముడిపడి ఉంటుంది. ప్రశాంతమైన నిద్ర తల నొప్పిని తగ్గించడానికి సహాయపడును. కావాల్సినంత నిద్ర లేనప్పుడు మెదడుకు ఒత్తిడి పెరుగుతుంది. దీని వల్ల కొన్ని సార్లు విపరీతమైన తల నొప్పి వస్తుంది.
సమయానికి ఆహరం తినకపోవడం, ఆకలి కూడా తలనొప్పికి కారణమవుతుంది.
Also Read: Anchor Shiva: ప్రశాంత్ అసలు రూపం ఇదే.. యాంకర్ శివ ఇన్స్టాగ్రామ్ పోస్ట్..!