Skin Care: వయసు పెరుగుతున్న కొద్దీ ముఖంలో వృద్ధాప్యం కనిపించడం చాలా సహజం. కానీ మీ వయస్సు కంటే ముందే మీ ముఖంలో వృద్ధాప్యం కనిపిస్తే, దీనికి కారణం మీ జీవన శైలి అలవాట్లు. ముఖంపై ముడతలు కనిపించి చర్మం వదులుగా మారితే వెంటనే ఈ అలవాట్లను మానుకోండి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము
డీ హైడ్రేషన్
శరీరంలో డీ హైడ్రేషన్ సమస్య ఆరోగ్యానికి మాత్రమే కాదు చర్మ సౌందర్యానికి కూడా మంచిది కాదు. నీళ్లు తక్కువగా తాగడం వల్ల ముఖంపై అకాల ముడతలు ఏర్పడతాయి. చర్మంలో తేమ లేకపోవడం ఇందుకు కారణం. కావున చర్మాన్ని లోపల నుంచి హైడ్రేట్ చేయడం, ఆహారంలో వీలైనంత వరకు ద్రవ పదార్ధాలను చేర్చడం చాలా ముఖ్యం.
సన్ స్క్రీన్ అప్లై చేయడంలో నిర్లక్ష్యం
సూర్యకాంతి నుంచి వచ్చే హానికరమైన కిరణాలు తరచుగా చర్మాన్ని దెబ్బతీస్తాయి. వయస్సు రాకముందే ముఖంపై ముడతలు కనిపిస్తే, సన్‌స్క్రీన్ సరిగ్గా అప్లై చేయకపోవడం దీనికి కారణం. సన్‌స్క్రీన్ UV కిరణాల నుంచి రక్షిస్తుంది. అలాగే యవ్వన చర్మానికి కావాల్సిన కొల్లాజెన్ విచ్ఛిన్నతను నివారిస్తుంది. బయటకు వెళ్లే ముందు సన్‌స్క్రీన్‌ని అప్లై చేయడం మర్చిపోవద్దు.
ధూమపానం
ధూమపానం ఆరోగ్యానికి హాని కలిగించడమే కాకుండా, దాని వల్ల వృద్ధాప్య ప్రభావం కూడా పెరుగుతుంది. చర్మం వయస్సు కంటే ముందే ముసలిగా కనిపిస్తుంది. పొగాకు చర్మంలోని కొల్లాజెన్, ఎలాస్టిన్ ఫైబర్‌లకు హాని కలిగిస్తుంది. దీని కారణంగా అకాల వృద్యాప్యం కనిపించడం ప్రారంభమవుతుంది.
ఒత్తిడి, నిద్ర లేకపోవడం
ప్రతిరోజూ నిద్రలేమి ఒత్తిడిని కూడా చర్మం పై ప్రభావం చూపుతుంది. ఇది అకాల వృద్ధాప్యం, నిర్జీవంగా, ముడతలు పడడానికి కారణమవుతుంది.
పొడి బారిన చర్మం
చర్మం చాలా పొడిగా ఉండే వ్యక్తులు. వీరికి ముడతలు, కుంగిపోవడం వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల పొడి చర్మానికి మరింత జాగ్రత్త అవసరం. చర్మానికి తగినంత హైడ్రేషన్ అందించాలి తద్వారా ముడతలు రావు.
Also Read: Life Style: పళ్ళు తోముకోకుండా ఉదయాన్నే నీళ్లు తాగితే ఏమవుతుంది..?