Melasma: మొహం పై మచ్చలు ఎందుకు వస్తాయో తెలుసా..?

ముఖంపై కనిపించే గోధుమ రంగు మచ్చలను మెలాస్మా అంటారు. శరీరంలో వచ్చే మార్పులు, జీవన శైలి విధానాలే ఈ సమస్యకు కారణమని చెబుతున్నారు నిపుణులు. హార్మోన్ల అసమతుల్యత, సూర్యరశ్మి, అధిక వేడి, ఫోన్ నుంచి వెలువడే బ్లూ లైట్, జన్యుపరమైన కారణాలు మొహం పై మచ్చలకు కారణమవుతాయి.

New Update
Melasma: మొహం పై మచ్చలు ఎందుకు వస్తాయో తెలుసా..?

Melasma: మహిళల ముఖంపై తరచు ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడటం గమనిస్తుంటాము. కొన్నిసార్లు అవి లేత గోధుమ రంగులో కూడా ఉంటాయి. ముఖంతో పాటు చేతులు, మెడ, భుజాల పై కూడా వస్తుంటాయి. చాలా మంది ఈ మచ్చలను తేలికగా తీసుకొని అజాగ్రత్తగా ఉంటారు. కానీ ఈ గోధుమ రంగు మచ్చలను మెలస్మా అంటారు. దీనికి కారణం శరీరం లోపల అలజడి, హార్మోన్ల అసమతుల్యత. మొహం పై ఇలాంటి గోధుమ రంగు మచ్చలకు కారణలేంటో ఇప్పుడు తెలుసుకుందాము..

హార్మోన్ల మార్పులు

మెలస్మా లేదా చిన్న చిన్న మచ్చలకు కారణం శరీరంలోని హార్మోన్ల మార్పులే. ముఖ్యంగా గర్భధారణ సమయంలో హార్మోన్ల మార్పులు దీనికి కారణం. అందుకే మచ్చలను ప్రెగ్నెన్సీ మాస్క్ అని కూడా అంటారు. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్లలో హెచ్చుతగ్గులు మెలనోసైట్‌లను ప్రేరేపిస్తాయి. దీని వల్ల మెలనిన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది చర్మంపై పిగ్మెంటేషన్‌కు దారితీస్తుంది. దీని కారణంగా చర్మంపై మచ్చలు కనిపించడం ప్రారంభమవుతాయి. కొన్నిసార్లు గర్భనిరోధక మాత్రలు , ఇతర హార్మోన్ల పునఃస్థాపన చికిత్సలు కూడా చర్మంపై మచ్చలు కనిపించడానికి కారణమవుతాయి.

సూర్యరశ్మి

బలమైన సూర్యకాంతి కారణంగా, చర్మంపై మచ్చలు కనిపించడం ప్రారంభిస్తాయి. అల్ట్రా వాయిలేట్ కిరణాలు మెలనోసైట్‌లను ప్రభావితం చేస్తాయి. దీని కారణంగా మెలనిన్ మరింత పెరగడం ప్రారంభమవుతుంది. అందుకే వేసవిలో మచ్చల సమస్య తీవ్రం అవుతుంది.

అధిక ఉష్ణోగ్రత 

సూర్యకాంతి వల్ల మాత్రమే కాకుండా అధిక ఉష్ణోగ్రత వల్ల కూడా మెలస్మా పెరుగుతుంది. వేడి ఉష్ణోగ్రతలో ఎక్కువసేపు ఉంటే, మచ్చలు కనిపించడం ప్రారంభిస్తాయి. అదే సమయంలో, అధిక ఉష్ణోగ్రతతో పాటు, చెమట కూడా మచ్చల ప్రభావాన్ని పెంచుతుంది.

బ్లూ లైట్

ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి వెలువడే లైట్లు కూడా మెలస్మాకు కారణమవుతాయని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి.

జన్యుపరమైన కారణాలు

తల్లిదండ్రులకు మెలస్మా ఉన్నవారిలో కూడా మెలస్మా తరచుగా కనిపిస్తుంది. చర్మంపై గోధుమ రంగు మచ్చలు కూడా జన్యుపరమైనవి.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Also Read: Aam Panna Drink: సమ్మర్ స్పెషల్ డ్రింక్ ఆమ్ పన్నా .. హీట్ స్ట్రోక్ కు అద్భుతమైన చిట్కా

Advertisment
తాజా కథనాలు