/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-10T164636.411.jpg)
Face Yoga: ఫ్యాట్ డిపాజిట్స్ శరీరం పైనే కాకుండా ముఖంపై కూడా ఏర్పడతాయి. దీని వల్ల కాలక్రమేణా ముఖ చర్మం వదులుగా కనిపించడం ప్రారంభమవుతుంది. మొహం అగ్లీగా కనిపిస్తుంది. కుంగిపోయిన చర్మాన్ని సరిదిద్దడంలో, అలాగే ముఖాన్ని సరైన ఆకృతికి తీసుకురావడంలో ఫేస్ యోగా సహాయపడుతుంది. మొహం పై కొవ్వును తగ్గించడానికి ఈ వ్యాయామాలు చేయండి.
బెలూన్ పోజ్
ఈ యోగాసనాన్ని చేయడానికి, నోటిలో గాలిని నింపి, పెదాలను మూసుకోండి. తద్వారా బుగ్గల ప్రదేశంలో చర్మం పూర్తిగా బిగుతుగా మారుతుంది. ఈ ఫేస్ యోగా చేయడం వల్ల బుగ్గల చుట్టూ పేరుకుపోయిన కొవ్వు , వదులుగా ఉండే చర్మం బిగుతుగా మారుతుంది. ఈ వ్యాయామం ప్రతిరోజూ కనీసం 30 సెకన్ల నుంచి ఒక నిమిషం వరకు చేయవచ్చు. ఇలా చేయడం వల్ల బుగ్గల చుట్టూ చర్మం బిగుతుగా మారుతుంది.
ఎయిర్ కిస్
కొన్ని సందర్భాల్లో మెడపై అధిక కొవ్వు నిల్వ ఉంటే. అలాగే డబుల్ చిన్ కనిపించడం గమనిస్తుంటాము. కావున ప్రతిరోజూ కనీసం ఒక నిమిషం పాటు ఈ వ్యాయామం చేయండి. గడ్డాన్ని పైకి ఎత్తాలి. తద్వారా మెడ చర్మం పూర్తిగా సాగుతుంది. తర్వాత పెదాలను ఒకదానికొకటి దగ్గరగా ఉంచడం ద్వారా ముద్దు ఆకారంలో వస్తుంది. ఈ భంగిమలో పైకి చూడండి. దీని వల్ల మెడ నుంచి ముఖం వరకు సాగుతుంది. ఇలా రోజూ ఫేస్ యోగా చేయడం వల్ల డబల్ చిన్ త్వరగా తొలగిపోతుంది.
చేపల భంగిమ
గడ్డం, బుగ్గల చుట్టూ అదనపు కొవ్వు పేరుకుపోయినప్పుడు.. ఈ వ్యాయామం చేయడం చేయడం ద్వారా కొవ్వు తగ్గించడమే కాకుండా చిన్ ఆకృతిని మెరుగుపరుస్తుంది. ఫిష్ పోజ్ చేయడానికి, పెదాలను ఒకదానికొకటి దగ్గరగా ఉంచుతూ బుగ్గలను లోపలికి లాగండి. దీని కారణంగా చేప ఆకారంలో నోరు ఏర్పడుతుంది. ఒక నిమిషం పాటు ఇలా ఉంచండి. దీని ద్వారా దవడ ఆకృతి అందంగా మారుతుంది. కొవ్వు కూడా తగ్గుతుంది.
గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
Also Read: Sleep Deprivation: ఏంటీ..! నిద్రలేమి గుండె పోటు, క్యాన్సర్ కు కారణమా..?