Life Style: ఇలాంటి ప్రదేశాల్లో అస్సలు వాకింగ్ చేయకండి.. ఆరోగ్యానికి చాలా ప్రమాదం..!

చాలా మంది ఉదయం లేవగానే బయటకు వెళ్లి వాకింగ్ లేదా జాగింగ్ చేస్తుంటారు. కానీ వాహనాలు, ఇండస్ట్రీస్ నుంచి వచ్చే కలుషితాల వల్ల వాతావరణంలో కాలుష్యం పెరిగిపోయింది. ఇలాంటి కలుషితమైన వాతావరణంలో వ్యాయామాలు చేయడం వల్ల ఊపిరితిత్తుల పై తీవ్రమైన ప్రభావం చూపుతుంది.

New Update
Life Style: ఇలాంటి ప్రదేశాల్లో అస్సలు వాకింగ్  చేయకండి.. ఆరోగ్యానికి చాలా ప్రమాదం..!

Life Style: ఉదయాన్నే వాకింగ్ చేయడానికి బయటకు వెళ్లే వాళ్ళు.. వాళ్ళు వ్యాయామం చేసే ప్రదేశాల పై కూడా శ్రద్ధ పెట్టాలి. చెట్లు ఎక్కువగా, స్వచ్ఛమైన గాలి ఉండే ప్రదేశాల్లో వ్యాయామాలు చేస్తే ఆరోగ్యానికి మంచింది. అలా కాకుండా కలుషితమైన ప్రదేశాల్లో వ్యాయామాలు చేయడం వల్ల శ్వాస వ్యవస్థ పై ప్రభావం చూపడమే కాకుండా ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి.

కలుషితమైన ప్రదేశాల్లో వ్యాయామాలు చేస్తే ఆరోగ్యానికి కలిగే నష్టాలు..

ఆరోగ్యం పై హానికరమైన కలుషితాల ప్రభావం

కలుషితమైన ప్రదేశాల్లో వ్యాయామాలు చేయడం వల్ల ఆరోగ్యానికి హాని కలిగించే దుమ్ము, దూళి, పొగ, వంటి హానికరమైన కలుషితాలు గాలి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి. అంతే కాదు వాహనాల నుంచి వచ్చే హానీకరమైన కెమికల్స్ పొగ రూపంలో శరీరంలోకి వెళ్లి ఊపిరితిత్తుల ఆరోగ్యం పై ప్రభావం చూపుతాయి. చాలా రోజుల పాటు ఇలాగే కలుషితమైన ప్రదేశాల్లో వ్యాయామాలు చేస్తే శ్వాసక్రియ వ్యాధులతో పాటు గుండె సంబంధిత వ్యాధులకు కూడా దారి తీస్తుంది.

ఊపిరితిత్తుల పై ప్రభావం

కలుషితమైన గాలిలో  నైట్రోజన్ డయాక్సైడ్ వంటి హానికరమైన కలుషితాలు ఉంటాయి. ఇవి ఊపితిత్తుల పై నేరుగా ప్రభావం చూపుతాయి. ఈ కలుషితాలను పీల్చడం వల్ల.. గురక, దగ్గు, ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండడం వంటి శ్వాస సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. అంతే కాదు ఎక్కువ రోజులు వీటికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఆస్తమా, COPD వంటి శ్వాస సంబంధిత వ్యాధులు తీవ్రమయ్యే అవకాశం ఉంది.

రోగ నిరోధక శక్తి పై ప్రభావం

కలుషితమైన ప్రదేశాల్లో వ్యాయామం చేయడం ఊపిరితిత్తులతో పాటు రోగ నిరోధక శక్తి పై కూడా ప్రభావం చూపును. అంతే కాదు ఈ కలుషితాల వల్ల.. శ్వాసక్రియ వ్యాధులు, అలెర్జీస్ వంటి ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. కలుషితమైన ప్రదేశాల్లో వ్యాయామం చేస్తే ఆరోగ్యం పై అదనపు ఒత్తిడిపెరుగుతుంది.

శారీరంకంగా  చురుకుగా ఉండాలంటే ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అలాగే మనం వ్యాయామాలు చేసే ప్రదేశాల పై కూడా దృష్టి పెట్టాలి.  వాకింగ్, జాగింగ్, వ్యాయామాలు కలుషితమైన ప్రదేశాల్లో కాకుండా స్వచ్ఛమైన గాలి దొరికే ప్రదేశాల్లో ఎక్కువగా చేయండి. ఒక వేళ అలాంటి పరిస్థితి లేనప్పుడు ఇంట్లోనే చేయడానికి ప్రయత్నించండి.

Advertisment
Advertisment
తాజా కథనాలు