Oil Massage: స్నానానికి ముందు ఆయిల్ మసాజ్ చేస్తే ఏమవుతుంది..?

సైన్స్ ప్రకారం స్నానానికి ముందు ఆయిల్ మసాజ్ చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆయిల్ మసాజ్ చర్మంలోని మృతకణాలు తొలగించి మెరిసే చర్మాన్ని అందిస్తుంది. అలాగే శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

New Update
Oil Massage: స్నానానికి ముందు ఆయిల్ మసాజ్ చేస్తే ఏమవుతుంది..?

Oil Massage: స్నానానికి ముందు ఆయిల్ మసాజ్ చేసే సంప్రదాయం భారతదేశంలో శతాబ్దాల నాటిది. ఆయుర్వేదంలో దీనిని అభ్యంగ్ అంటారు. అయితే స్నానం చేసే ముందు ఆయిల్ మసాజ్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము..

నిపుణుల అభిప్రాయం ఏంటంటే

నిపుణుల అభిప్రాయం ఆయిల్ మసాజ్ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా చలికాలంలో ఆయిల్ మసాజ్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కొబ్బరి నూనె, నువ్వుల నూనె , బాదం నూనె ఆయిల్ మసాజ్ కు ఉత్తమమైనవిగా పరిగణించబడతాయని నిపుణుల అభిప్రాయం.

మానసిక ఒత్తిడి

సైన్స్ ప్రకారం, ఆయిల్ మసాజ్ వల్ల చర్మంలోని మృతకణాలు తొలగిపోయి.. కొత్త కణాలు ఏర్పడి చర్మం మెరుస్తూ ఉంటుంది. ఇది కాకుండా, మసాజ్ కండరాలను కదిలిస్తుంది. మానసిక ఒత్తిడిని తగ్గించి.. చర్మంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.

publive-image

మెరుగైన రక్త ప్రసరణ

స్నానానికి ముందు ఆయిల్ మసాజ్ చేయడం ద్వారా చర్మంలోని రక్త ప్రసరణ పెరుగుతుంది. ఇది చర్మానికి అవసరమైన పోషకాలు , ఆక్సిజన్‌ను అందించడంలో సహాయపడుతుంది. అంతే కాదు ఆయిల్ మసాజ్ చర్మంలో తేమను మెయింటైన్ చేస్తుంది. దీని వల్ల స్నానం చేసిన తర్వాత కూడా చర్మం పొడిబారదని నిపుణుల సలహా .

Also Read: Kalki2898AD: ఫ్యాన్స్ కు కల్కి మేకర్స్ బంపర్ ఆఫర్.. కేవలం రూ. 100కే టికెట్

Advertisment
తాజా కథనాలు