Almond Peel: ప్రతీ రోజు డైట్ లో బాదం పప్పులు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలోని విటమిన్ ఇ, కాల్షియం, ఫాస్పరస్, జింక్, సెలీనియం, కాపర్, నియాసిన్, ఐరన్ వంటి పోషకాలు అనేక ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. అయితే కేవలం బాదంతో మాత్రమే కాదు వాటి తొక్కలతో కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. బాదం పప్పులను నానబెట్టుకొని తిన్న తర్వాత.. చాలా మంది వాటి తొక్కలను విసిరేయడం చేస్తుంటారు. కానీ ఈ తొక్కలను కూడా తిరిగి ఉపయోగించవచ్చు. తొక్కతో కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాము..
బాదం తొక్క ప్రయోజనాలు
- ముందుగా బాదం తొక్కలను ఎండలో ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత వాటిని మిక్సీలో వేసి పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడిని అనేక విధాలుగా ఉపయోగించుకోవచ్చు.
- ఈ పొడిని ఫేస్ ప్యాక్‌లో మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఇది విటమిన్ ఇ, ముఖానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. అలాగే చర్మం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంచుతుంది.
- జుట్టు ఆరోగ్యం కోసం కూడా బాదం తొక్కల పొడిని ఉపయోగించవచ్చు. ఈ పొడిలో కాస్త పెరుగు, అలోవెరా జెల్‌తో కలిపి జుట్టుకు అప్లై చేయండి. ఈ పేస్ట్ జుట్టు పెరుగుదలను పెంచడంతో పాటు జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.
- నానబెట్టిన బాదం తొక్కలను నేలలో కలపండి. ఇది నేలను సారవంతంగా చేస్తుంది. ఇంట్లో మొక్కలు పెరగకపోతే ఈ బాదం తొక్కలను మట్టిలో వేయండి. ఇవి సేంద్రియ ఎరువులుగా పనిచేసి నేలకు అవసరమైన పోషకాలను అందిస్తాయి.
- ఈ బాదం తొక్కలను పొడిని సలాడ్, పెరుగు, బ్రెడ్ మొదలైన వాటిపై తక్కువ పరిమాణంలో చల్లుకోవచ్చు. దీంతో ఆహార పదార్థాల రుచి మారడమే కాకుండా పోషకాహారం కూడా అందుతుంది.
Also Read: Sravana Masam: శ్రావణ మాసంలో శివుడికి నైవేద్యంగా ఈ ప్రసాదాన్ని సమర్పించండి - Rtvlive.com