LIC Market Cap: దేశంలోని అతిపెద్ద బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) రూ. 25,464 కోట్ల ఆదాయపు పన్ను రీఫండ్ ఆర్డర్‌ను అందుకుంది. ప్రస్తుత త్రైమాసికంలో (జనవరి-మార్చి, 2024) ఆ రీఫండ్ కంపెనీకి క్రెడిట్ అయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు వివరాలను ఎల్ఐసీ చైర్మన్ సిద్ధార్థ్ మహంతి వెల్లడించారు. గత నెల, ఆదాయపు పన్ను శాఖకు చెందిన ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్ (ITAT) 25,464.46 కోట్ల రూపాయల రీఫండ్ (LIC Market Cap)కోసం నోటీసు జారీ చేసింది. రీఫండ్ గత ఏడు అసెస్మెంట్ సంవత్సరాల్లో పాలసీ హోల్డర్లకు చెల్లించిన మధ్యంతర బోనస్‌లకు సంబంధించినది.
పూర్తిగా చదవండి..LIC Market Cap: ఎల్ఐసీ వెలిగిపోతోంది.. భారీగా ఐటీ రీఫండ్స్.. పెరిగిన మార్కెట్ విలువ
LICకి ఆదాయపు పన్ను రీఫండ్ భారీగా అందనుంది. ఈ త్రైమాసికంలో మొత్తం రూ. 25,464 కోట్ల ఆదాయపు పన్ను రీఫండ్ అందుతుందని ఎల్ఐసీ చైర్మన్ సిద్ధార్థ్ మహంతి వెల్లడించారు. మరోవైపు LIC మార్కెట్ క్యాప్ రూ.6,83,637.38 కోట్లకు చేరుకుంది.
Translate this News: