LIC Amritbaal : అమృతబాల్.. పిల్లల కోసం ఎల్ఐసీ అదిరిపోయే కొత్త పాలసీ 

LIC పిల్లల భవిష్యత్ కోసం ఎల్‌ఐసీ అమృతబాల్ పేరుతొ కొత్త ప్లాన్ అందుబాటులోకి తెచ్చింది. పిల్లల ఉన్నత విద్య - ఇతర అవసరాలను తీర్చడానికి తగిన కార్పస్‌ని కలిగి ఉండేలా ఈ ప్లాన్ ఉంటుందని LIC ప్రకటించింది. ఈ ప్లాన్ పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ చూడండి. 

LIC : మన ఎల్‌ఐసీకి తిరుగులేదు.. ప్రపంచంలోనే నంబర్ వన్
New Update

LIC Amritbaal Scheme Launched : ప్రభుత్వ బీమా సంస్థ 'లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా'(LIC) కొత్త బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. దాని పేరు 'ఎల్‌ఐసీ అమృతబాల్'(LIC Amritbaal). దీనిని 'ప్లాన్ 874' అని కూడా పిలుస్తారు. ఇది పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్లాన్.  ఒక విధంగా ఇది పిల్లల బీమా పాలసీ కూడా. సామాన్య ప్రజలు 17 ఫిబ్రవరి 2024 నుండి ఈ పాలసీని తీసుకోవడానికి వీలుంటుంది. ఈ పాలసీలో ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో  ఇప్పుడు తెలుసుకుందాం. 

దేశంలోని అతిపెద్ద బీమా కంపెనీకి చెందిన 'LIC అమృత్‌బాల్'(LIC Amritbaal) ప్లాన్ పర్సనల్ సేవింగ్స్ అలాగే  లైఫ్ ఇన్సూరెన్స్ పథకం(Life Insurance Scheme). పిల్లల ఉన్నత విద్యకు తగిన ఫండ్ సృష్టించే విధంగా దీనిని ప్రత్యేకంగా రూపొందించారు. అదే సమయంలో, ఇది పిల్లల ఇతర అవసరాలను కూడా ఈ పాలసీ తీరుస్తుంది.

ఈ ప్లాన్‌(LIC Amritbaal) లో, ప్రతి రూ. 1000 సమ్ అష్యూర్డ్‌కు రూ. 80 నిష్పత్తిలో ఎల్‌ఐసి హామీతో కూడిన రాబడిని ఇస్తుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే, ఈ రూ. 80 రిటర్న్ మొత్తం బీమా పాలసీకి అంటే ఇన్సూర్డ్ ఎమౌంట్ కి యాడ్ అవుతుంది.  మీ పిల్లల పేరు మీద రూ.లక్ష ఇన్సూరెన్స్ వచ్చిదనుకోండి.. దానికి  LIC రూ. 8000 హామీ మొత్తాన్ని జోడిస్తుంది. ఈ హామీతో కూడిన రాబడి ప్రతి సంవత్సరం పాలసీ సంవత్సరం చివరిలో యాడ్ చేస్తుంది. అలాగే ఇది మొత్తం పాలసీ వ్యవధి ముగిసే వరకు కొనసాగుతుంది. అంటే మీరు పాలసీ 15 ఏళ్లకు తీసుకున్నారు. దీనిలో ఇన్సూర్డ్ ఎమౌంట్ లక్షరూపాయలు అనుకుందాం. అప్పుడు ప్రతి ఏటా 8 వేలు చొప్పున దీనికి యాడ్ అవుతూ వస్తుంది. 15 ఏళ్లకు ఇన్సూర్డ్ ఎమౌంట్ రెండు లక్షల ఇరవై వేలు అవుతుంది. 

Also Read: పేటీఎం ఫాస్టాగ్ డీయాక్టివేట్ చేసుకోవడం ఎలా?

LIC Amritbaal పాలసీ ఫీచర్స్ ఇవే.. 

  • 30 రోజుల నుంచి 13 ఏళ్ల లోపు పిల్లలకు ఈ పాలసీ తీసుకోవచ్చు. ఈ పాలసీ కనీస మెచ్యూరిటీ వయస్సు 18 సంవత్సరాలు అలాగే  గరిష్టంగా 25 సంవత్సరాలుగా ఉంటుంది. 
  • ఈ పాలసీకి 5, 6 లేదా 7 సంవత్సరాల స్వల్పకాలిక ప్రీమియం చెల్లింపు నిబంధనలు అందుబాటులో ఉన్నాయి. అయితే గరిష్ట ప్రీమియం చెల్లింపు వ్యవధి 10 సంవత్సరాలు.
  • మీరు సింగిల్ ప్రీమియం చెల్లింపు ఎంపికను ఎంచుకోవాలనుకుంటే, మీరు దానిని కూడా ఎంచుకోవచ్చు. అయితే, ప్లాన్ కింద మీరు కనీసం రూ. 2 లక్షల బీమా మొత్తాన్ని తీసుకోవాలి. 
  • మీరు 5వ, 10వ లేదా 15వ సంవత్సరంలో మనీ బ్యాక్ ప్లాన్ వంటి మెచ్యూరిటీ సెటిల్‌మెంట్ తీసుకోవచ్చు.
  • ఈ పాలసీలో ఇన్వెస్ట్ చేసే వారు మెచ్యూరిటీపై సమ్ అష్యూర్డ్, గ్యారెంటీ రిటర్న్‌ల ప్రయోజనాన్ని పొందుతారు. 
  • పాలసీని తీసుకునే వ్యక్తులు 'సమ్ అష్యూర్డ్ ఆన్ డెత్' ఎంపికను కూడా ఎంచుకోవచ్చు. అదే సమయంలో, నామమాత్రపు అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా ప్రీమియం వైబర్ ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు.
  • కంపెనీ అందించే ఇతర పొదుపు ప్లాన్‌ల మాదిరిగానే, దీనిలో కూడా పాలసీ కింద రుణాలను పొందవచ్చు.

LIC తన ఆఫ్‌లైన్ ఛానెల్‌ల ద్వారా ఈ LIC Amritbaal పాలసీ అందిస్తోంది.  అంటే ఈ నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్ ప్లాన్, ఏజెంట్లు / ఇతర మధ్యవర్తుల ద్వారా ఆఫ్‌లైన్‌లో అలాగే ఆన్‌లైన్‌లో నేరుగా www.licindia.in వెబ్‌సైట్ ద్వారా తీసుకోవచ్చు. ఈ పాలసీ పూర్తి వివరాల కోసం LIC బ్రోచర్ ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా చూడవచ్చు.

Also Read : YouTube Remix : యూట్యూబ్ లో కొత్త ఫీచర్.. షార్ట్స్ క్రియేటర్స్ మడత పెట్టేయొచ్చు..

Watch this Interesting Video :

#lic #plan-874 #lic-amritbaal #lic-policies
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి